వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
పాన్ ఇండియా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్' ముందు వరుసలో ఉంటుంది. సాధారణంగా సందీప్‌రెడ్డి వంగా సినిమాల్లో హీరోలు విచిత్రమైన యాటిట్యూడ్‌తో కనిపిస్తుంటారు. ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ, ‘కబీర్‌సింగ్'లో షాహిద్‌కపూర్, ‘యానిమల్'లో రణబీర్‌కపూర్ పాత్రలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్' సినిమాలో పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిన ప్రభాస్‌ని సందీప్ ఎలా చూపించబోతున్నాడు?.. అనే ఊహే ప్రేక్షకులను రోమాంచితులను చేస్తున్నది.
పాన్ ఇండియా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ ముందు వరుసలో ఉంటుంది. సాధారణంగా సందీప్‌రెడ్డి వంగా సినిమాల్లో హీరోలు విచిత్రమైన యాటిట్యూడ్‌తో కనిపిస్తుంటారు. ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ, ‘కబీర్‌సింగ్’లో షాహిద్‌కపూర్, ‘యానిమల్’లో రణబీర్‌కపూర్ పాత్రలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిన ప్రభాస్‌ని సందీప్ ఎలా చూపించబోతున్నాడు?.. అనే ఊహే ప్రేక్షకులను రోమాంచితులను చేస్తున్నది.
అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ప్రభాస్ పాత్ర.. విభిన్నంగా, విచిత్రంగా, మాస్ ప్రేక్షకులు మురిసిపోయేలా, సగటు ప్రేక్షకుడు సంబరపడిపోయేలా, యువతరం ఉర్రూతలూగేలా ఉంటుందట. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది అక్టోబర్ 29న దీపావళి కానుకగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఇంటెన్స్, ైస్టెలిష్, మిస్టీరియస్ అవతారంలో ఉన్న ప్రభాస్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. బ్లాక్ క్యాప్, డార్క్ సన్ గ్లాసెస్, గడ్డంతో, రఫ్ అండ్ టఫ్‌గా క్లోజప్ ప్రొఫైల్ షాట్లో ప్రభాస్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. పవర్ఫుల్ కథతో, క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయిక. వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రధారి. ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్ నిర్మాతలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

