Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Prithvi - Akriti : ఇటవలే బ్రేకప్ అయిన భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తీపికబురు చెప్పాడు. నెల క్రితం ప్రేయసి ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) తమ నిశ్చితార్ధం రద్దు చేసుకోవడంతో వార్తల్లో నిలిచిన అతడు.. ఇప్పుడు ఆమెతోనే జీవితం అంటున్నాడు.
Prithvi – Akriti : ఇటవలే బ్రేకప్ అయిన భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తీపికబురు చెప్పాడు. నెల క్రితం ప్రేయసి ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) తమ నిశ్చితార్ధం రద్దు చేసుకోవడంతో వార్తల్లో నిలిచిన అతడు.. ఇప్పుడు ఆమెతోనే జీవితం అంటున్నాడు. సెప్టెంబర్ 17న ‘మేము విడిపోతున్నా’మని ప్రకటించిన ఆకృతి తాజాగా మేము మళ్లీ ఒక్కటయ్యాం, ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసి బాధ పెట్టినందుకు బాధ్యత తీసుకుంటున్నా అని పోస్ట్ పెట్టింది. దాంతో.. నెలరోజులైన గడవక ముందే ఇద్దరి మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు. తమ ప్రేమ బంధాన్ని ఈసారి పెళ్లి వరకూ తీసుకెళ్లాలని ఇరువురు భావించడమే అందుకు కారణమని తెలుస్తోంది.
కూర్చొని మాట్లాడుకుంటే భార్యభర్తల మధ్య గొడవలే కాదు.. ప్రేమికుల మధ్య అంతరమూ తగ్గిపోతోంది. అందుకు తాజా ఉదాహరణ భారత క్రికెటర్ పృథ్వీ షా. ఈ డాషింగ్ బ్యాటర్‌తో నిశ్చితార్ధం చేసుకున్న ఆకృతి అగర్వాల్.. సెప్టెంబర్‌లో అతడికి బ్రేకప్ చెప్పింది. దాంతో.. వీరి ప్రేమ పెళ్లిపీటలెక్కలేదని అంతా బాధ పడ్డారు.
అయితే.. నెల తిరక్కముందే ఆకృతి మనసు మారింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకొని తమ మధ్య ఉన్న మనస్ఫర్థలు, అపోహలను వదలించుకున్నారు. ఇంకేముంది.. మళ్లీ లవ్ ట్రాక్ మొదలైంది. ఇకపై నువ్వే నా జీవితం అంటూ మునపటిలా లైఫ్‌ను ఆస్వాదిస్తోందీ జోడీ. తాజాగా వ్యక్తిగత జీవితం గురించిన స్పష్టత అంటై ఆకృతి పెట్టిన పోస్ట్‌తో వీరి ప్రేమ ఎంత బలమైనదో బయటపడింది.
India cricketer Prithvi Shaw and actor Akriti Agarwal have reconciled after previously calling off their engagement. Akriti admitted external opinions influenced her decision to end the engagement, taking responsibility for the hurt caused. The couple has communicated openly and decided to give their relationship another chance, asking for privacy. Shaw, a talented batter who captained India’s Under-19 World Cup team, has faced career challenges but is showing promising form in domestic cricket with Maharashtra during the 2026-27 season.
Read more: https://t.co/V1ejnYYOCx
#PrithviShaw #AkritiAgarwal #CelebrityNews #CricketNews #EntertainmentNews #IndianCricket
— IndiaToday (@IndiaToday) October 13, 2026
‘మా నిశ్చితార్ధాన్ని నేను రద్దు చేసుకున్నప్పుడు సన్నిహితుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యమిచ్చా. మా అనుబంధం గురించి మాకంటే వారికే ఎక్కువ తెలియడమే అందుకు కారణం. అయితే.. నాకు కాబోయే భర్త గురించి, మా బంధం గురించి ఏవోవో చెప్పి వారు నన్ను తప్పుదోవ పట్టించారు. దాంతో.. పృథ్వీతో కలిసి మాట్లాడకుండానే నేను నిశ్చితార్ధం రద్దు నిర్ణయం తీసుకున్నా. నేను కలిగించిన బాధకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాక ఒకరినొకరం మరింత అర్ధం చేసకున్నాం. కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. మాకు మేము ఇలా ఉండిపోవాలి. వేరే ఎవరూ అవసరం లేదు. ఈసారి ప్రేమ, నమ్మకం, అర్ధం చేసుకోవడం ద్వారానే మా భవిష్యత్ సాగాలని భావిస్తున్నా. మళ్లీ ఒక్కటిగా ఉండాలనుకున్న మా నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి’ అని ఆకృతి తమ ప్రేమ కథ పునరుద్దరించబడిన తీరును వివరించింది.
టెండూల్కర్ పెళ్లిలో
ఈ ఏడాది మేలో పృథ్వీ షా, ఆకృతిల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. సినిమా నటి అయిన ఆకృతికి ఉంగురం తొడిగిన ఫొటోలను ఈ డాషింగ్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ ఫొటోకు ‘నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్’ అనే క్యాప్సన్ జోడించాడు షా. ఎంగేజ్మెంట్ అనంతరం ఇద్దరూ అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) పెళ్లిలో తళుక్కుమన్నారు కూడా. కానీ, ఉన్నట్టుండి.. మా దారులు వేరని సెప్టెంబర్ 17న ఓ పోస్ట్‌తో అందరికీ షాకిచ్చిందీ జోడీ.
అంతకుముందు కొన్ని రోజులుగా అతడి ప్రవర్తనను తప్పుపడుతూ పోస్టులు పెట్టిన ఆకృతి.. ‘మేము విడిపోతున్నాం’ అని ప్రకటించింది. అయితే.. విద్వేషాలకు తావివ్వకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఒకరిమనసు ఒకరు గెలుచుకున్న ఇద్దరూ.. మళ్లీ ఒక్కటవ్వడంతో ‘ఇక పెళ్లి ఎప్పుడు?’ అని అడుగుతున్నారంతా. భారత జట్టుకు దూరమైన షా దేశవాళీలో మెరుస్తున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) గూటికి చేరిన అతడు వచ్చే సీజన్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

