Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ కాశీ సెట్‌కు సంబంధించిన ఏరియల్ వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది.
Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ కాశీ సెట్‌కు సంబంధించిన ఏరియల్ వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియాలో ఇటీవల అప్డేట్ అయిన యాపిల్ మ్యాప్స్ ద్వారా ఈ సెట్‌ను గుర్తించిన నెటిజన్లు, దాని భారీ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘వారణాసి’ సినిమా కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో అత్యంత భారీ స్థాయిలో కాశీ నగరాన్ని తలపించే సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందులో పురాతన ఆలయాలు, గంగానది ఘాట్లను పోలిన నిర్మాణాలు, నగర వీధులు ఇలా అనేక అంశాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.
తాజాగా యాపిల్ మ్యాప్స్‌లో ఈ ప్రాంతానికి సంబంధించిన ఏరియల్ చిత్రాలు అప్డేట్ కావడంతో, సినిమా సెట్‌ను గుర్తించిన కొందరు నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సెట్ విస్తీర్ణం, నిర్మాణాల సంఖ్య, ప్రాచీన నగరాన్ని తలపించే విధానం చూసి అభిమానులు రాజమౌళి విజన్‌ను ప్రశంసిస్తున్నారు. సినిమా కోసం ఇంత భారీ స్థాయిలో సెట్స్ నిర్మించడం మరోసారి ఆయన సినిమాల మేకింగ్ స్టాండర్డ్స్‌ను తెలియజేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ‘వారణాసి’ భారతీయ పురాణాల నేపథ్యంతో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. టైమ్ ట్రావెల్ అంశాలు కూడా ఇందులో కీలకంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు.
విభిన్న కాలాలు, పురాణ అంశాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాల కంటే మరింత భారీ విజువల్ స్కేల్లో ‘వారణాసి’ ఉండబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఇతర సాంకేతిక పనులపై చిత్ర బృందం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీమ్ ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారీ సెట్స్, నటీనటుల లుక్, కథపై వస్తున్న ప్రచారంతో ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
Panchayat Grading | పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం.. కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

