పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ల గ్రేడింగ్ ప్రక్రియ పంచాయతీ కార్యదర్శుల పాలిట శాపంగా మారింది. జీపీలను ఏ ప్రాతిపదికన వర్గీకరించాలన్న అంశంపై స్పష్టత లేక కార్యదర్శుల ఉద్యోగోన్నతులు, కొత్త నియామకాలు నిలిచిపోయాయి.
- కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం
- ఇంకా పరిశీలనలోనే ప్రతిపాదనలు
- ఆరు నెలలైనా తేల్చని ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ల గ్రేడింగ్ ప్రక్రియ పంచాయతీ కార్యదర్శుల పాలిట శాపంగా మారింది. జీపీలను ఏ ప్రాతిపదికన వర్గీకరించాలన్న అంశంపై స్పష్టత లేక కార్యదర్శుల ఉద్యోగోన్నతులు, కొత్త నియామకాలు నిలిచిపోయాయి. సమస్య పరిషారానికి ఉద్యోగ సంఘాలు రెండు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించ గా, పంచాయతీరాజ్‌శాఖ వాటిని ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకొన్నది. ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం ఏర్పడింది.
రెండు ప్రతిపాదనలు.. రెండు వాదనలు
గ్రేడింగ్‌పై తెలంగాణ గ్రామపంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ (టీపీఎస్ఏ) ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. జీపీ లకు వచ్చే వార్షిక ఆదాయం ప్రాతిపదికగా నాలుగు గ్రేడ్లుగా విభజించాలని కోరింది. మరోవైపు టీఎన్జీవో అనుబంధ పంచాయ తీ సెక్రటరీల సెంట్రల్ ఫోరం గ్రేడ్ల విభజన లో 40:25:20:15 నిష్పత్తిలో కేటాయింపులు చేయాలని ప్రతిపాదించింది. అంటే గ్రేడ్-1కు 40 శాతం, గ్రేడ్-2, గ్రేడ్-3, గ్రేడ్ -4లకు చెరో 20 శాతం కేటాయించాలని కోరింది. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2026 ఏప్రిల్ 15న కూడా గ్రేడింగ్‌కు సంబంధించిన ప్రతిపాదన సమర్పించగా, నవంబరు 2న కమిషనర్ దివ్య మరో సమగ్ర నివేదికను పంపించారు. అయితే ఏ ప్రతిపాదనను ఆమోదించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఆరు నెలలుగా ఫైళ్లకే పరిమితం
కార్యదర్శుల పదోన్నతులు, కొత్త పోస్టుల సృష్టికి కీలకమైన గ్రేడింగ్ ప్రతిపాదనలను ప్రభుత్వం తొక్కి పెట్టడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నది. పదోన్నతులకు అవసరమైన పోస్టుల సంఖ్య, అర్హతలు, సర్వీస్ నిర్మాణం వంటి అంశాలు గ్రేడింగ్‌తో ముడిపడి ఉండటంతో తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గ్రేడింగ్ విధానంతోపాటు కార్యదర్శుల వేతన వ్యయం, అదనపు పోస్టుల అవసరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను కూడా పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.
కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వాలి
2018లో కొత్త పంచాయతీరాజ్ చ ట్టం ప్రకారం గ్రామపంచాయతీలు అ మల్లోకి వచ్చాయి. కాబట్టి రాష్ట్రంలో గల ప్రతి పంచాయతీకి ఒక గ్రేడ్ క ల్పిస్తూ, మొత్తం నాలుగు గ్రేడ్లగా విభజించి ప్రతి జీపీకి కార్యదర్శులను ని యమించాలి. క్లసర్ విధానం తొలగించాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్ర మోషన్లు ఇవ్వాలి. క్యాడర్ స్ట్రెంత్ పెరిగేలా కొత్త నియామకాలు చేపట్టాలి
– శ్రీనివాస్, టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

