గణపతి చనిపోయి ఉండొచ్చు!
మావోయిస్టు అగ్రనేతలు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, జోడే రత్నాబాయి, వార్త శేఖర్ ఎక్కడున్నారో తెలియడం లేదని, బహుశా వారు చనిపోయి ఉండొచ్చని డీజీపీ సీవీ ఆనంద్ అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం ఈ ముగ్గురి ఆచూకీ దొరుకడం లేదని, ఒకవేళ వాళ్లు ముగ్గురు బతికి ఉంటే లొంగిపోవాలని కోరారు.
- ఆయనతోపాటు రత్నాబాయి, వార్తా శేఖర్ కూడా..
- కేంద్ర దర్యాప్తు సంస్థలకూ అంతుచికని ఆచూకీ
- ఆ ముగ్గురు మిగిలి ఉంటే.. వాళ్లూ లొంగిపోవాలి
- కర్రెగుట్టల్లో ఆయుధ డంప్లున్నయ్: డీజీపీ ఆనంద్
- 214 మంది నక్సల్స్‌కు రూ.5.69 కోట్ల రివార్డులు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు అగ్రనేతలు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, జోడే రత్నాబాయి, వార్త శేఖర్ ఎక్కడున్నారో తెలియడం లేదని, బహుశా వారు చనిపోయి ఉండొచ్చని డీజీపీ సీవీ ఆనంద్ అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం ఈ ముగ్గురి ఆచూకీ దొరుకడం లేదని, ఒకవేళ వాళ్లు ముగ్గురు బతికి ఉంటే లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు పు నరావాసం కల్పించడంలో భాగంగా సోమవా రం డీజీపీ కార్యాలయంలో 214 మంది మాజీ మావోయిస్టులకు సీవీ ఆనంద్ రూ.5.69 కోట్ల నగదు రివార్డులు అందించా రు. గతంలో లొంగిపోయిన రోజునే ఒకొకరికి రూ.25 వేల చొప్పున తాతాలిక ఆర్థిక సా యం అందించామని తెలిపారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 824 మంది మావోయిస్టు క్యాడర్లు జనజీవన స్రవంతిలో చేరినట్టు డీజీపీ తెలిపారు. లొంగిపోయి న వారిలో తెలంగాణ నుంచి 59 మంది ఉండగా, మిగిలిన వారు ఛత్తీస్‌గఢ్, ఏపీ, మ హారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందినవారున్నట్టు ఆయన పేర్కొన్నారు. లొంగిపోయిన మన రాష్ట్రం వారికి నగదుతోపాటు హెల్త్‌కార్డులు, ఇండ్ల స్థలాలు కల్పిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ఇతర ప్రాంతాల క్యాడర్లకు వారి రా ష్ర్టాల పునరావాస విధానాల ప్రకారం ప్రయోజనాలు అందేలా చేస్తున్నామని పేరొన్నారు.
కర్రెగుట్టల్లో ఇంకా ఆయుధాల డంపులు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల ప్రాంతంలో ఇంకా ల్యాండ్‌మైన్స్, ఆయుధాల డంపులు ఉన్నాయని అందుకే పర్యాటకులను అనుమతించడం డీజీపీ ఆనంద్ తెలిపారు. తొమ్మిది మావోయిస్టు డంప్‌లను గుర్తించి 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్ స్వా ధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటిలో నాలుగు ఎల్ఎంజీలు, 48 ఏకే-47 రైఫిళ్లు, ఒక కోల్ట్ రైఫిల్, ఒక టవర్ రైఫిల్, 37 ఇన్సాస్ రైఫిళ్లు, 37 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 303 రైఫిళ్లు 2, ఒక 51 ఎంఎం మోర్టార్తో పాటు 98 ఇతర తుపాకులు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మిస్ అయిన 500 ఆయుధాల జాడ లభించలేదన్నారు. కార్యక్రమంలో ఇంటలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, శాంతిభద్రతల డీజీ అకున్ సబర్వాల్, సీఐ సెల్ ఎస్పీ సింధూశర్మ, ఓఎస్డీలు దయానంద్, వేణుగోపాల్, ఎస్పీ రమేశ్, అడిషనల్ ఎస్పీ శ్యామ్‌బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

