నిరుద్యోగ పాపం ప్రైవేటుదేనట
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల వ్యాపార వేత్తలపై చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక వ్యవస్థలోని సమస్యలను మరోసారి చర్చకు తెచ్చాయి. కార్పొరేట్ పన్నులను తగ్గించినప్పటికీ కంపెనీలు ఉద్యోగ నియమాకాలు చేపట్టడం లేదని, ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
- ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మోదీ యత్నం
- పారిశ్రామిక వేత్తలపై చిందులు అందులో భాగమే!
- ఏటా 2 కోట్ల కొలువుల హామీని అటకెక్కించిన బీజేపీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల వ్యాపార వేత్తలపై చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక వ్యవస్థలోని సమస్యలను మరోసారి చర్చకు తెచ్చాయి. కార్పొరేట్ పన్నులను తగ్గించినప్పటికీ కంపెనీలు ఉద్యోగ నియమాకాలు చేపట్టడం లేదని, ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యలకు ప్రభుత్వ విధానాలు, ఆర్థిక నిర్వహణ లోపాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రైవేట్ రంగంపై నెట్టేసేందుకు ప్రధాని ప్రయత్నించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారని నెటిజన్లు నిలదీస్తున్నారు. కార్పొరేట్లకు మొదటి నుంచి భారీగా రాయితీలు కల్పించిన మోదీ సర్కార్.. ఇన్నేండ్లుగా మిన్నకుండి ఇప్పుడు
ప్రశ్నించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
ముందు నుంచీ హెచ్చరిస్తున్నా..
నవంబర్ 1న ఫిక్కి వార్షిక సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. పరిశ్రమల అధిపతులను నేరుగా ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్త నియామకాలు చేపట్టారా? అని నిలదీశారు. 2019లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించినా, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ ఆకలి చాలా ఎక్కువగా ఉంది. ఎంత పెట్టినా మీ కడుపు నిండటం లేదు అంటూ వ్యాపారవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే దేశంలో నిరుద్యోగం, వేతనాల స్తబ్ధత, ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం వంటి సమస్యలపై ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని మోదీ సర్కార్.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కార్పొరేట్లపైకి నెపం నెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేట్లకు కొమ్ముకాచి..
మోదీ ప్రభుత్వ హయాంలో కొద్ది మంది బడా పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యం లభించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణను ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆస్తుల నిర్వహణలో కొన్ని కార్పొరేట్ సంస్థలకు అధిక ప్రయోజనం కల్పించారన్న విమర్శలను గుర్తు చేస్తున్నారు. దేశ సంపదలో అసమానతలు పెరుగుతున్నాయని, అత్యంత సంపన్నుల చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతున్నదని పేర్కొంటున్నారు. మరోవైపు నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాలు, ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్ వంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు, లాక్‌డౌన్‌తో వేలాది కంపెనీలు మూతపడ్డాయని, అనేక మంది రోడ్డునపడ్డారని వెల్లడించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా ఖాళీలు..
బంగారు బాతుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు మోదీ సర్కార్ తెగనమ్ముతున్నదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలం గడుపుతున్నదని విమర్శిస్తున్నారు. నిరుద్యోగులపై మోదీ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నియామకాలు చేపట్టకుండా ప్రైవేట్ రంగంపై వేలెత్తిచూపడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని నెటిజన్లు నిలదీస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

