Home
Hyderabad
Dasoju Sravan Kumar Questions Congress Government Over Water Connections For Slum Residents
బస్తీల్లో నల్లాకు ఎన్వోసీ కావాలా?
నిరుపేదలుండే బస్తీల్లో నల్లా అనుమతికి ఎన్వోసీ కావాలా..? ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలనా..?’అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
- ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన
- ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ దాసోజు ఫైర్
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తేతెలంగాణ): ‘నిరుపేదలుండే బస్తీల్లో నల్లా అనుమతికి ఎన్వోసీ కావాలా..? ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలనా..?’అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సీఎం ఇంటికి 300 మీటర్ల దూరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46 అంబేద్కర్ బస్తీవాసులు 9 నెలలుగా నల్లా కనెక్షన్ కోసం ఎదురుచూస్తుంటే పట్టించుకొనే నాథుడే కరువయ్యారని సోమవారం ఎక్స్ వేదికగా దాసోజు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇక హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చన్నారు. బస్తీలకు స్లమ్ ఏరియా సర్టిఫికెట్ ఉంటే నల్లా కనెక్షన్ ఇస్తామని, 100 చ.మీ. 7 మీటర్ల ఎత్తులోపు ఉన్న ఇండ్లకు ఎన్వోసీ మినహాయింపు జలమండలి మార్గదర్శకాల్లో ఉంటే మరీ పేదల నివాసాలకు ఎన్వోసీ ఎందుకని నిలదీశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

