అందరూ ఉన్నా.. అనాథలా!
సనత్నగర్ పీఎస్ పరిధిలోని ఫతేనగర్ శివాలయం సమీపంలోని లంబాడా బస్తీలో నివాసముంటున్న ముదావత్ బాలూనాయక్ (43) అక్టోబర్ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 21న సనత్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
- నెల కిందట అదృశ్యమైన వ్యక్తి
- రైలు ఢీకొని మృతిపోలీసుల నిర్లక్ష్యంతో కుటుంబానికి తీరని శోకం
- మిస్సింగ్ కేసులో భాగంగా మృతుడు బాలూనాయక్గా రైల్వే పోలీసుల నిర్ధారణ
- మృతదేహం స్వాధీనానికి రాని సనత్నగర్ పోలీసులు
- ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియల నిర్వహణ
- భర్త కడసారి చూపునకు నోచుకోకగుండెలవిసేలా రోదించిన భార్య
- బాధ్యులపై చర్యలుతీసుకోవాలంటూ..పీఎస్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
బేగంపేట, నవంబర్ 23:పోలీసుల నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. తప్పిపోయిన వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు సమాచారం అందించినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో మృతదేహానికి అనాథలా అంత్యక్రియలు జరిగిపోయాయి. నెల రోజుల తర్వాత విషయం తెలిసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోమవారం కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తన భర్తను చివరి చూపు చూసుకునే వీలు లేకుండా పోయిందంటూ.. మృతుడు బాలూనాయక్ భార్య సుశీల రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.
సనత్నగర్ పీఎస్ పరిధిలోని ఫతేనగర్ శివాలయం సమీపంలోని లంబాడా బస్తీలో నివాసముంటున్న ముదావత్ బాలూనాయక్ (43) అక్టోబర్ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 21న సనత్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే బాలూనాయక్ తప్పిపోయిన రోజు అర్ధరాత్రి సనత్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై రైలు ఢీకొని మృతి చెందాడు. మిస్సింగ్ కేపు దర్యాప్తునకు సంబంధించి తదుపరి చర్యల్లో భాగంగా సనత్నగర్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులను పరిశీలించిన నాంపల్లి రైల్వే పోలీసులు ముందు రోజు అర్ధరాత్రి రైలు పట్టాలపై చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి బాలూనాయక్గా నిర్ధారించుకొని..
సనత్నగర్ పోలీసులు వచ్చి మృత దేహాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ సమాచారం ఇచ్చారు. అయితే సనత్నగర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని కనీసం పరిశీలించకుండా వదిలేయడంతో మిస్సింగ్ కేసు కొససాగుతుండడం, బాధిత కుటుంబసభ్యులు కనిపించకుండా పోయిన వ్యక్తిని గురించి ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దాదాపు 33 రోజుల తరువాత కుటుంబ సభ్యులు నాంపల్లి రైల్వే పోలీసులను విచారించగా, వివరాలు పరిశీలించిన రైల్వే పోలీసులు.. బాలూనాయక్ మృతి చెందిన విషయాన్ని వెల్లడించారు. తాము అక్టోబర్ 21నే సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించిన విషయాన్ని చెప్పారు. మృతదేహం స్వాధీనానికి ఎవరూ రాకపోవడంతో తామే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. కాగా, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన స్థానికులు బాధిత కుటుంబసభ్యులతో కలిసి సనత్నగర్ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

