అగ్రి వీసీని విధుల నుంచి తొలగించాలి
అగ్రి వీసీ జానయ్య వ్యవహరించిన తీరుపట్ల సీఎం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఆయనను విధుల నుంచి తొలగించి, కేసు విచారణ చేపట్టాలని బాధితురాలు తేజశ్రీ డిమాండ్ చేశారు.
- దీక్ష చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ అరెస్ట్
- స్టేషన్లో దీక్ష కొనసాగింపు
వ్యవసాయ యూనివర్సిటీ, (హైదరాబాద్) నవంబర్ 23: అగ్రి వీసీ జానయ్య వ్యవహరించిన తీరుపట్ల సీఎం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఆయనను విధుల నుంచి తొలగించి, కేసు విచారణ చేపట్టాలని బాధితురాలు తేజశ్రీ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె అగ్రి వర్సిటీలోని ధర్నాచౌక్ వద్ద ధర్నాకు బైఠాయించగా స్థానిక పోలీసులు ఆమెను కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమె అక్కడ కూడా బైఠాయించి విలేకర్లతో మాట్లాడారు. న్యాయమైన పోరాటం చేస్తుంటే తనను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
వీసీ అధికార, డబ్బు బలంతో ఎన్నేండ్లు ఇలా అరాచకాలకు పాల్పడతాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ వేసి యూనివర్సిటీలో జరిగే అరాచకాలపై పారదర్శకంగా విచారణ జరుపాలన్నారు. తేజశ్రీకి న్యాయం జరిగేవరకు ఆమెకు అండగా ఉంటామని, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వీసీ జానయ్యను వెంటనే విధులనుంచి తొలగించి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి డిమాండ్ చేశారు. టాసా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చల్లా సౌజన్య, అధ్యక్షుడు పవన్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు అమృత్‌రెడ్డి, డాక్టర్ సునిత, ప్రశాంత్, కమలాకర్, జయరాజ్, రమేశ్, త్రివేణి, పరమేశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు కృష్ణమూర్తి, రాజ్‌కుమార్ తదిరులు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తేజశ్రీకి మద్దతు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

