సీఎంకు తెలంగాణ సోయే లేకపాయె!
‘మా ఆడోళ్లకు ఇస్తమన్న ఇరవై ఐదు వందల రూపాయల గురించి ఏమన్న జెప్పుతడేమో అని జూసినం.. ఏం లేదు, వట్టి ఒర్రుడు తప్ప. ఏం ముచ్చట్నయ్యా ఈయనెది. ముఖ్యమంత్రి హోదాల వచ్చిండు.. మూడేండ్లల్ల ఏం చేసిండో చెప్పాలె.. ముంగట ఏం చేస్తడో చెప్పాలె. కానీ గిదేనా మాట్లాడే తరీఖ.
‘ఈయనేం సీఎం అయ్యా.. నాలుగు మంచి మాటలు చెప్తే ఇందామని వచ్చినం…. నీళ్లు లేవు, కరువొచ్చింది అని చెప్తున్నడు.. యాసంగి పంట ఏసుకోవద్దని చెప్తున్నడు.. రైతులకు ఏమన్న సాయం గురించి చెప్తడేమోనని.. వచ్చినం. అవేం చెప్పలేదు. ఒక్కటే తిట్లు.. కేసీఆర్, కేటీఆర్‌ను, హరీశ్‌రావును తిట్టుడు తప్ప ఏం లేదు. ఛీఛీచీ.. మాట్లాడుడు మొదలు పెట్టినప్పటి నుంచి ఐపోయేదాక.. తిట్టుడు తప్ప ఏమున్నది. ఒక్క మంచి మాటన్న జెప్పిండా?’ అని సీఎం సిద్దిపేట సభకు హాజరైన వాళ్లు, మధ్యలోనే వెళ్లిపోతూ మాట్లాడుకున్న మాటలివి.
‘మా ఆడోళ్లకు ఇస్తమన్న ఇరవై ఐదు వందల రూపాయల గురించి ఏమన్న జెప్పుతడేమో అని జూసినం.. ఏం లేదు, వట్టి ఒర్రుడు తప్ప. ఏం ముచ్చట్నయ్యా ఈయనెది. ముఖ్యమంత్రి హోదాల వచ్చిండు.. మూడేండ్లల్ల ఏం చేసిండో చెప్పాలె.. ముంగట ఏం చేస్తడో చెప్పాలె. కానీ గిదేనా మాట్లాడే తరీఖ. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తి పొయ్యవయ్యా అంటే ఎత్తిపోస్తలేడు.. నీళ్లన్ని చంద్రబాబుకు ఇడిసి వెడ్తున్నడు.. ఒక్క మంచి పనన్న జేసిండా ఈయన.. ఈడికొచ్చి ఏందో లావు లావు మాట్లాడుతున్నడు’ ఈ మాటలన్నీ మొన్న సిద్దిపేటలో సీఎం మీటింగ్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోతూ జనాలు మాట్లాడుకున్న మాటలు. ఆ విధంగా సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి షో అట్టర్ ఫ్లాప్ అయింది. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఒక సభలో మాట్లాడుతూ ‘సిరిసిల్లకు వస్తా.. సిద్దిపేటపై దండయాత్ర చేస్తా’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు. ప్రభుత్వం చేస్తున్న పనులు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. కానీ దండయాత్రలు.. దాడులు చేస్తానని అసభ్య భాష మాట్లాడటం సబబుకాదు. తెలంగాణ రాష్ర్టానికే దిక్సూచి లాంటి జిల్లా సిద్దిపేట. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వ్యవసాయరంగంలో మార్పు వచ్చింది. ఉచిత కరెంటు, రైతుబంధు పథకాలతో అన్నదాతలు ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేశారు. గొప్పగా పంటలు పండించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు నిలబెట్టుకోలేదు. రాష్ర్టాన్ని ఆగం చేసింది. రేవంత్‌రెడ్డి తుగ్లక్ చర్యలను, ప్రజావ్యతిరేక పాలనను బీఆర్ఎస్ అడుగడుగునా ఎండగడుతున్నది. కేసీఆర్ దిశానిర్దేశంలో కేటీఆర్, హరీశ్‌రావు ప్రజాక్షేత్రంలో రేవంత్‌రెడ్డిని దోషిగా నిలబెడుతున్నారు. ప్రజల్లో రేవంత్‌రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత పెరిగింది.
ఈ పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలపై సీఎం ఎదురుదాడి చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం సిరిసిల్లలో సభ పెట్టి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అసభ్య దూషణలతో ప్రసంగించారు. ఇప్పుడు సిద్దిపేటలోనూ అదే చేశారు. ప్రభుత్వ యంత్రాగాన్ని, పోలీసులను అడ్డు పెట్టుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళల్ని, కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి సభ పెట్టారు. సభలో పదివేల మంది మఫ్టీ పోలీసులే మోహరించడం, ప్రభుత్వ అభద్రతకు నిదర్శనం.
సిద్దిపేట సభ పేరుకు ఇందిరాగాంధీ బీమా పథకం ప్రకటన కోసం అని ప్రభుత్వం చెప్పింది. కానీ సభలో బీమా పథకం గురించి ప్రస్తావన కూడా చేయలేదు. పథకం ఎవరికి వర్తిస్తుంది.. విధివిధానాలు ఏమిటో చెప్పలేదు. తాను చేసింది ఏమిటో.. భవిష్యత్తులో చేయబోయేది ఏమిటో ప్రస్తావించలేదు. ప్రసంగం ప్రారంభం నుంచి చివరి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే లక్ష్యంగా సాగింది. తాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయం మరచిపోయి కనీస రాజకీయ విలువలు కూడా పాటించకుండా ఒక గల్లీ స్థాయి లీడర్ కంటే అధ్వానమైన భాషలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే సభ ప్రారంభానికి ముందే ప్రాంగణం నుంచి జనం వెళ్లిపోవడం మొదలయ్యింది. సీఎం ప్రసంగం మొదలు పెట్టగానే మహిళలంతా తండోపతండాలుగా బయటకు వెళ్లిపోయారు. 80 శాతం కుర్చీలు ఖాళీ అయ్యాయి. ఆ ఖాళీ కుర్చీలకే సీఎం తన మాటలను వినిపించారు.
సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి తెప్పించిన కొద్దిపాటి మంది ప్రజలను చివరి గ్యాలరీలో కూర్చోబెట్టారు. ప్రజలను నిజానికి ముందు వరుసలో కూర్చోపెట్టాలి. కానీ, ముందు కూర్చోబెడితే ప్రజల నుంచి నిరసనలు, ప్రశ్నలు వెల్లువెత్తుతాయనే ఉద్దేశంతో చివరి వరుసలో కూర్చోబెట్టారు. నియోజకవర్గం ప్రజలంటే కాంగ్రెస్ నాయకులకు ఎంత భయం ఉన్నదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సభకు వచ్చిన మహిళలను, రైతులను ఎవరిని కదిలించినా రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని విమర్శిస్తూ వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి బస్సుల్లో ఎక్కించుకొని తెచ్చిన ఇతర జిల్లాల మహిళలు సైతం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని తిట్టుకుంటూ వెళ్లిపోవడం కొసమెరుపు. సిద్దిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి వెటర్నరీ కళాశాల మంజూరు చేస్తారని, వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖానకు నిధులు మంజూరు చేస్తారని. ప్రజలు ఆశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన రోడ్ల నిర్మాణ పనులకు నిధులు ఇస్తారని అనుకున్నారు. కానీ సిద్దిపేట ప్రజలకు నిరాశనే ఎదురయ్యింది. సభకు వచ్చిన సీఎం, ప్రజలు, మహిళలు, రైతుల ఆలోచనను, ఆకాంక్షలను అర్థం చేసుకోలేదు. అసలు ఆయనకు ప్రజల కోణం ఎందుకు తెలియడంలేదని, తెలంగాణ సోయి ఎందుకు లేదని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.
(వ్యాస రచయిత: సీనియర్ జర్నలిస్ట్)
కలకుంట్ల రంగాచార్య 8499990345
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

