RRB Jobs | భారతీయ రైల్వేలో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టులను భర్తీ చేయనున్నది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, డీఎంఎస్ విభాగాల్లోని 3993 ఖాళీలను ఆర్ఆర్బీ నింపనుంది. దీనిలో సికింద్రాబాద్ జోన్లో 110 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ సెప్టెంబర్ 13.
అర్హతలు
జూనియర్ ఇంజినీర్‌కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ (University) నుంచి డిప్లొమా/డిగ్రీలో (ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజినీరింగ్, ఎస్ అండ్ టీ) ఇంజినీరింగ్ లేదా సంబంధిత కోర్సు ఉత్తీర్ణత. డీఎంస్కు డిప్లొమా/డిగ్రీలో ఏదైనా ఇంజినీరింగ్ కోర్సు, కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ ఉతీర్ణులై ఉండాలి. వయస్సు 18 నుంచి 33 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, ఎక్స్సర్వీస్మెన్లకు వారి సర్వీసును బట్టి, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) స్టేజ్-1, స్టేజ్-2 రాత పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, రైల్వే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు మెటలర్జికల్ సూపర్వైజర్/రీసెర్చ్‌కు రూ. 44,900 (పే లెవల్ 7), జూనియర్ ఇంజినీర్, డీఎంఎస్కు రూ. 35,400 (పే లెవల్ 6) వేతనం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్‌లకు, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ, మహిళలు, ట్రాన్స్జెండర్లకు రూ. 250. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరితేదీ సెప్టెంబర్ 13. ఇతర వివరాలకు వెబ్సైట్ https://rrb.indianrailways.gov.in/లో చూడవచ్చు.