IND vs SL : గాలే టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టే.. తొలి రోజే ఆటకు అడ్డుపడ్డాడు వరుణుడు. టీ బ్రేక్ తర్వాత కాసేపటికే వాన పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. చినుకులు పడే సమయానికి భారత జట్టు స్కోర్.. 239/2. శతక వీరుడు దేవ్‌దత్ పడిక్కల్(107 నాటౌట్), 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్న రిషభ్ పంత్ మైదానం వీడారు.
గాలేలో శ్రీలంక బౌలర్లను ఉతికేస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. వర్షం అంతరాయ కలిగించే సమయానికి శతక వీరుడు దేవ్‌దత్ పడిక్కల్(107 నాటౌట్) జతగా రిషభ్ పంత్(3 నాటౌట్) ఆడుతున్నాడు. 63 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 239/2.
The covers are back on again in Galle as rain stops play.#TeamIndia 239/2 after 63 overs.
Stay tuned for further updates.
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/lKQfwrur7O
— BCCI (@BCCI) August 15, 2026
శ్రీలంక పర్యటనలో మంచి రికార్డున్న కేఎల్ రాహుల్‌తో(77 రిటైర్డ్ హర్ట్) అర్ధ శతకంతో మెరిశాడు. లంచ్ సెషన్ ఆసాంతం క్రీజులో నిలిచి టీమిండియా స్కోర్ దాటించిన రాహుల్.. టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్‌కు రాలేదు. కండరాల నొప్పితో విలవిలలాడిన అతడు రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వదిలాడు. దాంతో.. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్(16) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. ప్రభాత జయసూర్య ఓవర్లో గిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వర్షం అంతరాయ కలిగించే సమయానికి శతక వీరుడు దేవ్‌దత్ పడిక్కల్(107 నాటౌట్) జతగా రిషభ్ పంత్(3 నాటౌట్) ఆడుతున్నాడు. 63 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 239/2.
Century and counting 🔥
That feeling when you get to your Maiden Test Ton! 💯
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/arfiTOrS5v
— BCCI (@BCCI) August 15, 2026