Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగియడంతో రైలు నడిపేందుకు లోకో పైలట్ నిరాకరించాడు. రైల్వే నియమాలకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఒక స్టేషన్లో ఆ రైలు మూడు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాట్నా: పని గంటలు ముగియడంతో రైలు నడిపేందుకు లోకో పైలట్ నిరాకరించాడు. రైల్వే నియమాలకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఒక స్టేషన్లో ఆ రైలు మూడు గంటలకుపైగా నిలిచిపోయింది. (Loco Pilot Refuses To Work) ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాల్డా నుంచి సిలిగురి వెళ్తున్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఈఎంయూ) ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 2:52 గంటలకు ఠాకూర్ గంజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది. ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై అది ఆగింది.
కాగా, తన పని గంటలు ముగిసినట్లు లోకో పైలట్ తెలిపాడు. నిర్దేశించిన 9-10 గంటల పని గంటల పరిమితికి మించి రైలును నడపలేనని అధికారులకు తెలియజేశాడు. విశ్రాంతి లేకుండా రైలు నడిపేందుకు నిరాకరించాడు. దీంతో ఠాకూర్ గంజ్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై మూడు గంటలకుపైగా ఆ రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు ఈ సంఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఆ లోకో పైలట్ పని గంటలు ముగిసే సమయానికి మరో లోకో పైలట్‌ను అందుబాటులో ఉంచకపోవడం అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు.
Also Read:
Watch: రెండుసార్లు పడినప్పటికీ.. కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ యత్నం
Watch: లిఫ్ట్‌లో తలెత్తిన సమస్య.. వ్యక్తికి తృటిలో తప్పిన ముప్పు
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- drive
- Loco Pilot
- refuses
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

