DC Box Office Collection Day 1 | కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన తొలి చిత్రం ‘డీసీ’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ యాక్షన్ డ్రామా ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు రూ. 4.10 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు దాదాపు 3,500లకు పైగా షోలు పడ్డాయి. దీని ద్వారా ఇండియాలో గ్రాస్ కలెక్షన్లు రూ. 4.70 కోట్లుగా నమోదు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ. 1 కోటి వరకు రాబట్టింది. విదేశీ వసూళ్లతో కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 5.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అధికారికంగా నమోదు చేసింది.
ఈ చిత్ర వసూళ్లలో తమిళ వెర్షన్ ముందంజలో నిలిచి రూ. 2.60 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్ సాధించగా, తొలి రోజు అక్కడ 45.57 శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలతో పోలిస్తే రాత్రి షోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఆక్యుపెన్సీ రేటు ఏకంగా 67.38 శాతానికి పెరిగింది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, ఇక్కడ రూ. 1.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా 30.80 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తెలుగు EPIQ ఫార్మాట్లో మాత్రం అత్యధికంగా 71 శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా దుమ్ములేపింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం కేవలం రూ. 25 లక్షలు మాత్రమే రాబట్టి నిరాశపరిచింది.
‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, ఈ చిత్రంతో పూర్తి స్థాయి నటుడిగా మారడం విశేషం. ప్రస్తుతం లోకేష్ అల్లు అర్జున్‌తో ‘ఏఏ23’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.