Film Federation | టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ భారీ షాక్.. ఇకపై ఎలాంటి మద్దతు లేదని ప్రకటన!
Film Federation | టాలీవుడ్ సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ అనూహ్య రీతిలో షాకిచ్చింది. అసోసియేషన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్, ఇక నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని అధికారికంగా స్పష్టం చేసింది.
Film Federation | టాలీవుడ్ సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ అనూహ్య రీతిలో షాకిచ్చింది. అసోసియేషన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్, ఇక నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ సతీమణి సుమలత అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఫెడరేషన్ విడుదల చేసిన లేఖలో స్పష్టం చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిబంధనలను బేఖాతరు చేస్తూ సొంత నిర్ణయాలు అమలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం సస్పెన్షన్‌కు గురైన సభ్యులను మళ్లీ అసోసియేషన్లోకి ఆహ్వానించి, అందరితో కలిసి నడవాలని కౌన్సిల్ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తగిన సమయం కూడా కేటాయించామని ఫెడరేషన్ గుర్తుచేసింది. అయితే, ఈ హెచ్చరికలను మరియు పెద్దల నిర్ణయాలను పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే అనివార్యంగా ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఇక మీదట డాన్సర్స్ అసోసియేషన్‌కు తలెత్తే ఏ చిన్న సమస్య పరిష్కారంలోనూ తాము జోక్యం చేసుకోబోమని, బాధ్యత వహించమని కుండబద్దలు కొట్టింది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగే వేతనాల సవరణ ఒప్పందాల్లో సైతం ఆ అసోసియేషన్‌కు ఫెడరేషన్ నుంచి ఎలాంటి మద్దతు ఉండదని తేల్చిచెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

