Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో 27 ప్రాంతాలకు కొత్త పేర్లు
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో 27 ప్రదేశాలకు భారత్ కొత్త పేర్లను పెట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి కౌంటర్‌గా ఇండియా కూడా కొత్త పేర్లను ఫిక్స్ చేసింది. భారతీయ మ్యాప్‌లో సుమారు 27 ప్రదేశాలను గుర్తించి .. వాటికి ఇండియా కొత్త పేర్లను పెట్టింది.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో 27 ప్రదేశాలకు భారత్ కొత్త పేర్లను పెట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి కౌంటర్‌గా ఇండియా కూడా కొత్త పేర్లను ఫిక్స్ చేసింది. భారతీయ మ్యాప్‌లో సుమారు 27 ప్రదేశాలను గుర్తించి .. వాటికి ఇండియా కొత్త పేర్లను పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఆ ప్రదేశాలను గుర్తించారు. స్థానికులు గుర్తుపట్టే రీతిలో ఆ పేర్లను పెట్టినట్లు ప్రకటనలో తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టడాన్ని భారత్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న లాంగ్ జూ ప్రాంతం కూడా కొత్తగా పేరు పెట్టిన ప్రదేశంలో ఉన్నది. ఇక్కడే 1959లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోకి చైనా దళాలు ఎంటర్ అయ్యాయి.
లాంగ్ జూ సమీపంలో ఉన్న మాజా అనే గ్రామాన్ని కూడా కొత్త మ్యాప్‌లో మార్క్ చేశారు. ఇది అప్పర్ సుబన్సిరి జిల్లాలో ఉన్నది. పర్వత ప్రాంతాలైన జో లా, రిజా లా, పుకుర్ లాతో పాటు బిసా గ్రామం కూడా కొత్త లిస్టులో ఉన్నది. హై ఆల్టిట్యూడ్ పాసేజ్లో థాగ్ లా ఉన్నది. 1962లో ఇదే ప్రాంతంలో భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కూడా అధికారికంగా మ్యాప్‌లో గుర్తించారు. చాంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జైరాంపూర్ను కూడా లిస్టులో పెట్టారు.
సాంబో సరోవర్, బారా కుందన్, చోటా కుందన్, దాన్ బారి, ప్రిత్నగర్, తెరిత్నగర్, రామ్‌నగర్, జశ్వంత్ ఘర్, సాగర్, పద్మ, జ్యోతినగర్, బైసాకి ప్రాంతాలు కొత్త లిస్టులో ఉన్నాయి. షేర్ ఏ తప్పా స్మారకం, చోటా రూపక్, బారా రూపక్, శివాజీ నగర్, సున్‌పురా, కమలాంగ్ నగర్, కమలాంగ్ సాంక్చరీ, బుద్దామందిర్ కూడా జాబితాలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశాన్ని .. జాంగ్నాన్ అని చైనా పిలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

