Project Cheetah | నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చీతా.. ప్రాజెక్ట్ చీతాలో కీలక ఘటన
Project Cheetah : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో కీలక ఘటన చోటు చేసుకుంది. కూనో నేషనల్ పార్క్ పరిధిలోని ఒక చీతా.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
Project Cheetah : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో కీలక ఘటన చోటు చేసుకుంది. కూనో నేషనల్ పార్క్ పరిధిలోని ఒక చీతా.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. అది కూడా ప్రాజెక్ట్ చీతా ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగు చూడటం విశేషం. కేజీపీ 12 అనే చీతా పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం తల్లి చీతా, నాలుగు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక్కడ అసలైన విశేషం.. చీతా నాలుగు పిల్లలకు జన్మనివ్వడమే కాదు. ఆ జన్మనిచ్చిన తల్లి చీతా కూడా ఇండియాలోనే పుట్టడం మరో విశేషం. దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తెచ్చే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా ప్రారంభించిన సంగతి తెలిసిందే. నమీబియా సహా ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను ఇండియా తీసుకొచ్చారు. ఇక్కడ వాటి సంతతిని వృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
A truly historic and joyous moment for Project Cheetah!
A day after India’s Cheetah Project completed four years, KGP12, an Indian-born female cheetah, has given birth to four cubs in Kuno.
Four years, four new lives—a beautiful symbol of hope, resilience and the growing… pic.twitter.com/f1zbqSvx1b
— Bhupender Yadav (@byadavbjp) September 18, 2026
ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం మోదీ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17)న మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో చీతాల్ని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి చీతాలు అక్కడ వృద్ధి చెందుతున్నాయి. కొన్ని చీతాలు పిల్లలకు జన్మనిచ్చాయి. మధ్యలో కొన్ని చీతాలు మరణించాయి. దీంతో ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. కానీ, ఇండియాలో జన్మించిన చీతానే ఇప్పుడు మళ్లీ నాలుగు చీతా పిల్లలకు జన్మనివ్వడం విశేషం. దీంతో ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తాజాగా జన్మించిన నాలుగు పిల్లలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి షేర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

