Maoist to Modeling | మావోయిస్టు నుంచి మోడలింగ్ వైపు
Maoist to Modeling | అది ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం. అది మావోయిస్టులకు నిలయం. అందులో మహిళలు కూడా ఉన్నారు. అది ఒకప్పుడు. ఇప్పుడు వారు మోడలింగ్ వైపు దృష్టిసారించారు. ర్యాంప్ వాక్ చేస్తూ మెరిసిపోతున్నారు.
Maoist to Modeling | మావోయిస్ట్ (Maoist) అనే పదం వినగానే అందరికీ గుర్తుకువచ్చేది ఒంటిపై మందమైన ఒకేలాంటి వస్త్రం, చేతిలో ఆయుధం, సమాజాన్ని వదిలి దండకారణ్యంలో నివాసం అని. ఈ జీవితాన్ని వదిలి జనంలోకి వచ్చిన వారి జీవితాలు ఒక్కొక్కరివి ఒక్కో విధంగా ఉంటాయి. కానీ దీనికి భిన్నంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన మాజీ మహిళా మావోయిస్టుల జీవితం అందంగా ఆవిష్కృతమైంది. ఇందుకు రాయ్‌పూర్‌లో జరిగిన చేనేత దినోత్సవం 2026 కార్యక్రమం వేదికయ్యింది. అక్కడ బస్తర్‌లోని మాజీ మహిళా మావోయిస్టులు సంప్రదాయ చేనేత వస్త్రాలను ధరించి మోడల్‌గా మారి ర్యాంప్‌పై వాక్ చేశారు.
వారసత్వ చేనేత కోస సిల్క్ (Kosa Silk) వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై నడుస్తుంటే పండిట్ దీన్‌దయాళ్ ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ముందుకు నడిచేందుకు ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి వారితో మాట్లాడి వారి కొత్త జీవితం విజయం సాధించాలని కోరారు.
మాజీ మహిళా మావోయిస్టులు చేయూతనిచ్చే సంస్థల (Organisations)తో కలిసి తమకు నచ్చిన వృత్తులవైపు అడుగుపెడుతున్నారు. అలా వీరు సంఘర్షణల జీవితం నుంచి మోడలింగ్‌వైపు మళ్లారు. ఈ ఫ్యాషన్ షో వారి తిరుగుబాటు జీవితాన్ని వదిలి కొత్త జీవితం ఆరంభానికి ఆసరాగా నిలిచింది. సమాజంతో కలిసిపోవడానికి కొత్త అవకాశం లభించింది.
ఈ మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. మారిన వారి జీవనశైలిని చూసి చాలామంది స్పందించారు. ఇదే నిజమైన మహిళా సాధికారత అని వీడియో చూసిన ఒక వ్యక్తి అన్నారు. ఇదే నిజమైతే దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు అని మరొకరు అభిప్రాయం తెలిపారు. వారు మాజీ మావోయిస్టుల్లా కనిపించడం లేదని, ఇలాంటి కథలకు ప్రచారం ఎందుక లభించదు అని ఇంకొకరు తెలిపారు. వారి ఈ ప్రయాణం నిజంగా అద్భుతం అని మరొకరు వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

