బూర్గంపహాడ్, ఆగస్టు 13 : పారిశ్రామికవాడ సారపాకలో అక్రమంగా ఇసుకను తోడి రాశులుగా పోసిన అక్రమారులపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ చుక్కపల్లి బాలాజీ కోరారు. సారపాకలోని మసీద్ రోడ్, భాస్కర్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇసుక గుట్టలుగా పోసి సామాన్యులకు అందకుండా చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అభివృద్ధి కోసం అంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అభివృద్ధి పేరుతో ఇసుక మాఫియా అక్రమంగా ఇసుక నిల్వలు ఉంచుతూ సామాన్యులకు ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అధికారులు గతంలో మాదిరిగా ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేయాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ నిల్వలపై స్థానిక కార్యదర్శి సైతం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.