Kanwar Yatra : ఈ ఏడాదికి సంబంధించిన కన్వర్ యాత్ర ముగిసింది. ఈ యాత్రలో భాగంగా దాదాపు ఐదు కోట్ల మంది శివ భక్తులు దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ సందర్శించారు. అక్కడి పవిత్ర గంగా జలాల్ని తీసుకెళ్లారు. అయితే, ఈ యాత్ర సందర్భంగా హరిద్వార్‌లో భారీగా చెత్త పేరుకుపోయింది. కోట్లాది మంది భక్తుల రాకతో ఇక్కడి అనేక ప్రాంతాలు భారీ వ్యర్థాలతో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. అధికారుల అంచనా ప్రకారం.. హరిద్వార్‌లోని గంగా నది ఘాట్లైన హర్ కి పూరి సహా పలు ఘాట్లలో భారీ వ్యర్థాలు పేరుకుపోయాయి.
దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్లు అధికారుల అంచనా. వేలకొలది వాటర్ బాటిళ్లు, మల వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, దుస్తులు, అండర్‌వేర్స్, చెప్పులు వంటివి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పరిసరాల్ని అపరిశుభ్రంగా, వ్యర్థాలతో నిండి, దుర్వాసన వస్తున్నాయి. మహిళలు దుస్తులు మార్చుకునే రూమ్‌లు కూడా చెత్తతో నిండిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ వ్యర్థాల నిర్వహణ ఇప్పుడు అక్కడి అధికారులకు సవాలుగా మారింది. వ్యర్థాలు సేకరించడం, వేరు చేయడం, పరిసరాల్ని శుభ్రం చేయడం కోసం యుద్ధప్రాతిపదికన పని చేయాల్సి వస్తోంది. వ్యర్థాల సేకరణ కోసం 1,000 మంది వరకు పారిశుధ్య సిబ్బంది పని చేస్తున్నారని స్తానిక మున్సిపల్ కమిషనర్ నంద కుమార్ తెలిపారు.
Kanwar Yatra concludes in Haridwar…
Millions of devotees of Lord Shiva, Kanwariya’s attain salvation leaving behind 7,000 metric tonnes of garbage, undergarments, bottles filled with Urine across Ganga ghat and Har Ki Pauri.
Har Har Mahadev 𓉸𓆗🔱 pic.twitter.com/Nw8001IY3T
— D (@Deb_livnletliv) August 12, 2026
ఆగష్టు 12 నుంచి వ్యర్థాల తొలగింపు కొనసాగుతోందని, ఆగష్టు 18 వరకు సాగుతుందని వెల్లడించారు. వ్యర్థాల సేకరణ, రవాణా కోసం 80 వాహనాల్ని వినియోగిస్తున్నామని వివరించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా వ్యర్థాల్ని గుర్తించి, తొలగిస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. స్వచ్ఛంద సంస్తలు, కార్యకర్తలు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.