హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని వచ్చే నవంబర్ నుంచి అమలు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. సోమవారం ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమశాఖపై ఉన్నతస్థాయి స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ, పోస్ట్-మెట్రిక్ సాలర్ షిప్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పటివరకు 1,30, 000 మంది విద్యార్థులకు రూ. 450 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను ప్రతినెలా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఓవర్సీస్ సాలర్షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) 21వ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయాలని కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్‌ను తెలంగాణ నీటిపారుదల శాఖ సోమవారం ఒక లేఖలో కోరింది. వచ్చే నెల 1న హైదరాబాద్‌లోని కేఆర్ఎంబీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించేందుకు బోర్డు నిర్ణయించింది. అదే రోజున రాష్ట్ర మంత్రివర్గ(క్యాబినెట్) సమావేశం ఉండడంతో కేఆర్ఎంబీలో సభ్యుడిగా ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యదర్శి అందులో పాల్గొనాల్సి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేర కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(జనరల్) రమేశ్‌బాబు కేఆర్ఎంబీ చైర్మన్‌కు అధికారికంగా లేఖ రాశారు. క్యాబినెట్ భేటీ ఉన్నందున నిర్దేశిత తేదీన జరిగే సమావేశానికి హాజరుకాలేమని, సంబంధిత సభ్యులందరికీ అనుకూలమైన మరో తేదీకి వాయిదా వేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.