నస్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న టిప్పర్ లారీ
రాష్ట్రంలో ఇటీవల రోడ్లు రక్తమోడుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపటంతో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌లో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడగా, ఆటో డ్రైవర్.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
- నలుగురు మహిళల దుర్మరణం
- మరో నలుగురికి తీవ్ర గాయాలు
సీసీసీ నస్పూర్/మందమర్రి రూరల్, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలో ఇటీవల రోడ్లు రక్తమోడుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపటంతో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌లో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడగా, ఆటో డ్రైవర్.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మండలం గుడిపెల్లి, పొన్నారం గ్రామాలకు చెందిన ఏడుగురు కూలీలు నిత్యం వెళ్లే ఆటోలో పనుల కోసం సోమవారం మంచిర్యాలకు బయలుదేరారు. నస్పూర్ గేట్ మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి రాంగ్ రూట్లోకి వెళ్లింది. అదే సమయంలో మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ, ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలతో పాటు డ్రైవర్ చెల్లా చెదురుగా పడిపోయారు.
అగ్గు సౌందర్య(38), చింతకుంట్ల లక్ష్మి(28) అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, సీసీసీ నస్పూర్ ఎస్సై తహసీనుద్దీన్ ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఆరుగురిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇందులో తోగరి సుమలత (25), తోటపల్లి సోనీ(24) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటోడ్రైవర్ సెగ్గం ప్రశాంత్, సల్లూరి అనూషను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. మరో ఇద్దరు మహిళలు రామటెంకి దివ్యవాణి, సరమళ్ల లక్ష్మి చికిత్స పొందుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

