Woman Gang-Raped | పిల్లల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
Woman Gang-Raped | మహిళ పిల్లల ముందే ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి ఆ మహిళ చెంపపై గట్టిగా కొరికాడు. ఆ గాయం గురించి భర్త ఆరా తీయగా జరిగిన విషయం ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
భువనేశ్వర్: మహిళ పిల్లల ముందే ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి ఆ మహిళ చెంపపై గట్టిగా కొరికాడు. ఆ గాయం గురించి భర్త ఆరా తీయగా జరిగిన విషయం ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Gang-Raped) ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 20న జోడా ప్రాంతానికి చెందిన ఒక మహిళ పండుగ వేడుక కోసం భాగల్పూర్ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం వేళ పిల్లలతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణమైంది.
కాగా, రాత్రి 9 గంటల సమయంలో 34 ఏళ్ల బసుదేవ్ గగ్రై తన వాహనంలో ఇంటి వద్ద దింపుతానని చెప్పి ఆ మహిళ, ఆమె పిల్లలను ఎక్కించుకున్నాడు. అయితే ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. బిలేపాడ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల సుక్లాల్ ముండా కూడా అక్కడకు చేరుకున్నాడు. వారిద్దరూ కలిసి పిల్లల ముందే ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి ఆమె బుగ్గపై గట్టిగా కొరికాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ మహిళను బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు బుగ్గపై కొరికిన గాయం వల్ల ఆ మహిళ చెంప వాచింది. దీంతో ఏమి జరిగిందని ఆమె భర్త పలుమార్లు అడిగాడు. చివరకు జరిగిన విషయాన్ని ఆ మహిళ చెప్పింది. ఈ నేపథ్యంలో మార్చి 3న భర్తతో కలిసి జోడా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులైన బసుదేవ్, సుక్లాల్ను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Indore Man Jumps off | చెంపపై కొట్టిన పోలీస్.. బిల్డింగ్ పైనుంచి దూకి యవకుడు మృతి
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Rohini Acharya | నితీశ్ కీలుబొమ్మ.. మిత్రులను మోసం చేసినందుకు మూల్యం: రోహిణి ఆచార్య
Watch: హోలీ నాడు రంగులు చల్లిన బాలుడు.. మనవడిపై వేడినీరు పోసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bitten
- Cheek
- Children
- gang-raped
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

