VVS Laxman : తాత్కాలిక కోచ్‌గా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్షుడిగా విజయంతమైన వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)కు మరో కీలక పదవి దక్కనుంది. గౌతం గంభీర్ తర్వాత భారత పురుషుల జట్టు హెడ్‌కోచ్ అయ్యేందుకు అన్ని అర్హతలున్న లక్ష్మణ్ బీసీసీఐ(BCCI)లో పాగా వేయనున్నాడు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ఆరితేరిన భారత మాజీ ఆటగాడు బీసీసీఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ (Director Of Cricket)గా నియమితులయ్యే అవకాశముంది. త్వరలోనే బీసీసీఐ పలు పోస్టుల్లో భారీగా మార్పులు చేయనుంది. ఈ క్రమంలోనే.. సెప్టెంబర్‌లో లక్ష్మణ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలు అప్పగించాలని భారత బోర్డు భావిస్తోందని సమాచారం.
భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్ పదవిపై అనాసక్తిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ కీలక పదవి కట్టబెట్టనుంది. తనదైన క్రికెట్ బుర్రతో యువకుల్లో నైపుణ్యాలు పెంపొదిస్తున్న లక్ష్మణ్‌ను.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ సెప్టెంబర్‌తో చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కాలపరిమితి ముగియనుంది.
🚨 BIG NEWS FOR TEAM INDIA 🇮🇳
– If VVS Laxman becomes Team India’s new Director of Cricket, Gautam Gambhir will no longer remain India’s head coach. [Vaibhav Bhola] pic.twitter.com/sSs4dTYQP0
— lndian Sports Network (@IS_Netwrk29) August 14, 2026
అలానే కోచ్ పనితీరు కూడా సంతృప్తికరంగా లేదు. ఈ పరిస్థితుల్లో టాలెంట్ హంట్, కుర్రాళ్లకు శిక్షణలో, సీఈఓ హెడ్‌గా అనుభవమున్న లక్ష్మణ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ప్రకటించాలని బీసీసీఐ అనుకుంటోంది. ఒకవేళ ఈ బాధ్యతలు గనుక చేపడితే.. సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్‌లు, సీఓఈ మధ్య సమన్వయకర్తగా మన తెలుగోడు వ్యవహరించున్నాడు.
ఈ సెప్టెంబర్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి పలు హోదాల్లో కీలక మార్పులు చేయనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుండడంతో పాటు వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం స్క్వాడ్ ఎంపికపై కసరత్తు జరగాల్సిన సమయం వచ్చేసింది. దాంతో, ఒకవేళ ప్రపంచకప్ వరకూ అగార్కర్‌ను పొడిగిస్తే.. ఆటగాళ్ల ఎంపికలో వీవీఎస్ లక్ష్మణ్ సాయం తీసుకోవాలనుకుంటోంది బీసీసీఐ.

గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయిన జట్టుతోనే.. జింబాబ్వేనే క్లీన్‌స్వీప్ చేయించాడు లక్ష్మణ్. అందుకని.. అతడికి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు అప్పగిస్తే.. వరల్డ్‌కప్ స్క్వాడ్ ఎంపిక సవ్యంగా, ప్రతిభే కొలమానంగా జరుగనుందని బీసీసీఐ భావిస్తోంది.