రాయల్ లుక్… చలికి దుప్పటి, ఫ్యాషన్‌కు రెడ్ కార్పెట్
శీతకాలం వచ్చిందంటే చాలు.. సాధారణంగా అందరికీ రొటీన్ స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లే గుర్తొస్తాయి. అయితే, ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచం తన రూట్ మార్చేసింది. కేవలం చలిని తట్టుకోవడం మాత్రమే కాకుండా, ఆ చలికే ఫ్యాషన్ పాఠాలు చెప్పేలా సరికొత్త ట్రెండ్స్ ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టాయి.
చలికి పుట్టిద్దాం.. ఫ్యాషన్ ఫీవర్!
ఇది సాధారణ శాలువా కాదు. సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌తో తయారైన ర్యాప్ శాలువాకు మెడ చుట్టూ లేదా భుజాలపై అందంగా కనిపించే ఫ్లఫీ ఫాక్స్ ఫర్ కాలర్ జతచేస్తారు. కొన్నిటిలో కాలర్ డిటాచబుల్గా ఉంటుంది. మరికొన్నిటిలో శాలువా, కాలర్ రెండూ ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకవైపు షాల్ ఇచ్చే వెచ్చదనం, మరోవైపు ఫర్ కాలర్ ఇచ్చే రాయల్ లుక్… అంటే చలికి దుప్పటి, ఫ్యాషన్‌కు రెడ్ కార్పెట్ రెండూ ఒకే ప్యాకేజీలో అన్నమాట!
ఈ సీజన్లో వింటేజ్ గ్లామర్, మాడ్రన్ మినిమలిజం కలిసిపోయి కొత్త ఫ్యాషన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఫాక్స్ ఫర్ స్కార్ఫ్స్, ప్లష్ కాలర్స్, వాల్యూమినస్ వింటర్ యాక్సెసరీస్ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. పాతకాలపు హాలీవుడ్ హీరోయిన్ల లగ్జరీ లుక్‌ను గుర్తుచేస్తూనే, ఇప్పటి జనరేషన్‌కు సరిపోయే మాడ్రన్ టచ్‌ను అందిస్తున్నాయి.

Winter Fashion 1
ఈ శాలువా ప్రత్యేకత ఏమిటంటే, ఖరీదైన డిజైనర్ అవుట్‌ఫిట్ అవసరం లేకుండానే సాధారణ దుస్తులకు లగ్జరీ లుక్ తీసుకురాగలగడం. అంటే మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న పాత స్వెటర్‌కు కూడా కొత్త ప్రమోషన్ వచ్చినట్లే! ఈ సీజన్లో చాక్లెట్ బ్రౌన్, ఐవరీ వైట్, బర్గండీ, క్లాసిక్ బ్లాక్ వంటి రంగులు లగ్జరీ లుక్‌ను అందిస్తాయి. పాస్టెల్ పింక్, క్రీమ్ షేడ్స్ సాఫ్ట్ అండ్ ఎలిగెంట్ వైబ్‌ని క్రియేట్ చేస్తాయి. పెద్ద ఫ్లఫీ కాలర్స్, సాఫ్ట్ టెక్స్చర్స్, అసమానమైన డ్రేపింగ్ స్టయిల్ ఈ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
జీన్స్, టర్టిల్నెక్ టాప్‌తో ఈ శాలువా ధరించినట్లయితే కూల్ వింటర్ స్ట్రీట్ స్టయిల్ రెడీ. లాంగ్ డ్రెస్‌పైకి వేసుకుంటే రాయల్ ఈవెనింగ్ లుక్ వస్తుంది. ఉలెన్ కోటుపై ధరించినప్పుడు పాతకాలపు హాలీవుడ్ గ్లామర్ కనిపిస్తుంది. సాధారణ స్వెటర్పైనా ఇది అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఎక్కువ యాక్సెసరీస్‌తో ఓవర్ డూ చేయకండి. శాలువానే మీ అవుట్‌ఫిట్‌లో స్టార్‌గా ఉండనివ్వండి. లేదంటే ఫ్యాషన్ ఐకాన్ కాకుండా నడిచే టెడ్డీ బేర్లా కనిపిస్తారు సుమీ!

Winter Fashion 2
ఫ్యూచర్ ఫ్యాషన్‌కు వెల్కమ్
ఇది కేవలం ఒక వింటర్ యాక్సెసరీ మాత్రమే కాదు! కంఫర్ట్, క్రియేటివిటీ, క్లాసీ లుక్ కలిపిన ఫ్యాషన్ స్టేట్మెంట్. రాబోయే రోజుల్లో డిటాచబుల్ కాలర్స్, రివర్సిబుల్ షాల్స్, రీసైకిల్ ఫైబర్ డిజైన్స్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. చివరిగా… ఈ వింటర్లో చలికి వణుకుతూ స్టయిల్ కోసం ఎదురుచూడకండి. స్టయిల్‌నే మీ భుజాలపై వేసుకోండి!
కంఫర్ట్ కూడా ముఖ్యం
ఫాక్స్ ఫర్ అనేది నిజమైన జంతువుల ఉన్ని కాదు. సాధారణంగా సింథటిక్ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఫైబర్‌తో తయారవుతుంది. కొనేటప్పుడు మెటీరియల్ నాణ్యత, రీసైకిల్ ఫైబర్స్ వాడకం, తయారీ వివరాలను పరిశీలించడం మంచిది. అలాగే శాలువా ఎక్కువకాలం అందంగా ఉండాలంటే వాషింగ్ టిప్స్ ఫాలో అయితే సరి.

Winter Fashion 3

Winter Fashion 4
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

