Indore Man Jumps off | చెంపపై కొట్టిన పోలీస్.. బిల్డింగ్ పైనుంచి దూకి యవకుడు మృతి
Indore Man Jumps off | రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చిన యువకుడు, సెక్యూరిటీ గార్డు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీస్ అతడి చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన ఆ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి మరణించాడు.
ఇండోర్: రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చిన యువకుడు, సెక్యూరిటీ గార్డు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీస్ అతడి చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన ఆ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి మరణించాడు. (Indore Man Jumps off) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల రాజ్ మక్వానా గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాడు. ఆ కాంపెక్స్ బయట నడుస్తున్నాడు.
కాగా, రాజ్‌ను సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. ఉక్కపోత వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా స్వచ్ఛమైన గాలి, వాకింగ్ కోసం బయటకు వచ్చినట్లు అతడు చెప్పాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీస్ సిబ్బంది రాజ్‌ను ప్రశ్నించారు. ఇంతలో అతడి కుటుంబ సభ్యులు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చారు. రాజ్ క్షమాపణ చెప్పినప్పటికీ ఆ పోలీస్ అతడి చెంపపై కొట్టినట్లు కుటుంబ సభ్యులు విమర్శించారు. భయాందోళన చెందిన అతడు బిల్డింగ్‌పైకి పరుగెత్తి ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడని ఆరోపించారు. రాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాడని, మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు.
అయితే రాజ్‌ను పోలీసులు కొట్టలేదని పోలీస్ అధికారి తెలిపారు. అతడితో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. 45 నిమిషాల తర్వాత ఐదో అంతస్తు నుంచి రాజ్ దూకినట్లు సమాచారం అందిందని ఆ పోలీస్ అధికారి తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు వివరించారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Sharad Pawar | మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటు.. శరద్ పవార్ పోటీ
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Watch: రెండుసార్లు పడినప్పటికీ.. కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ యత్నం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

