గాలే: ఆల్రౌండర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja) .. అరుదైన క్లబ్లో చేరాడు. టెస్టుల్లో అతను 350వ వికెట్ తీసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా.. ఈ ఘనతను సాధించాడు. భారత టెస్టు క్రికెట్లో 350 వికెట్లు తీసుకున్న అయిదో ప్లేయర్గా ఆల్రౌండర్ జడేజా నిలిచాడు. దీంతో పాటు టెస్టు చరిత్రలో 350 వికెట్లతో పాటు 4 వేల రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో జడేజా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ఘనత అందుకున్న క్రికెటర్లలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ విట్టోరి ఉన్నారు.
📸📸 The feeling of getting your 350th Test wicket ❤️#TeamIndia all-rounder Ravindra Jadeja becomes only the Fifth Indian to achieve this milestone in men’s cricket 👏👏
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/YyZxYZbyay
— BCCI (@BCCI) August 17, 2026
మరో వైపు శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో తాజా సమాచారం ప్రకారం 274 రన్స్ చేసి 9 వికెట్లు కోల్పోయింది. సోనాల్ దినుషా సెంచరీ నమోదు చేశాడు. దినుషా 167 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఆరో వికెట్కు డిక్విల్లాతో కలిసి 146 రన్స్ జోడించి శ్రీలంకను ఆదుకున్నారు. చివరకు సెంచరీ హీరో దినుషా .. జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు.