Nursing Student | చెల్లాచెదురుగా దుస్తులు.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి..!
Nursing Student | వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి రాజేశ్వరి, సతీష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం తండ్రి సతీష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది.
Nursing Student | జూలూరుపాడు, సెప్టెంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి ఒంటిపై గాయాలు ఉండటం, దుస్తులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఇది ముమ్మాటికీ దారుణ హత్యేనని బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి రాజేశ్వరి, సతీష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం తండ్రి సతీష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. వీరి పెద్ద కుమార్తె ఇంద్రవెల్లి హరిణి (18) ఖమ్మం జిల్లా తనికెళ్ల సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల కళాశాలకు సెలవులు ఇవ్వడంతో కొత్తగూడెంలోని తన పిన్ని ఇంటికి వెళ్లిన హరిణి, రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో తల్లి రాజేశ్వరి అదే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనిపించలేదు.
బాత్రూం వెనుక భాగంలో నిర్జీవంగా..
ఆందోళనకు గురైన తల్లి పరిసరాల్లో వెతకగా, ఇంటి ఆవరణలోని బాత్రూం వెనుక భాగంలో హరిణి నిర్జీవంగా పడి ఉంది. కూతురి మృతదేహాన్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉండటం, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో గుర్తుతెలియని దుండగులు అఘాయిత్యానికి పాల్పడి, దారుణంగా హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ జీనత్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీం సహాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతి మృతికి గల కారణాలపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Read Also :
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

