SLW vs INDW | ఏషియన్ గేమ్‌లో ఇండియాకు తొలి స్వర్ణం.. టీ20 ఫైనల్ మ్యాచ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మహిళల క్రికెట్ జట్టు
SLW vs INDW | ఆసియా క్రీడలు(Asian Games) 2026 మహిళల క్రికెట్(SLW vs INDW )ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది.
SLW vs INDW | ఆసియా క్రీడలు(Asian Games) 2026 మహిళల క్రికెట్(SLW vs INDW )ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన స్వర్ణ పతక ఫైనల్ పోరులో పోరులో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 147 పరుగుల భారీ తేడాతో గెలిచిన హర్మన్ ప్రీత్ సేన 2022 తర్వాత మరోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు కేవలం 15.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 69 పరుగులకే ఆలౌట్ అయింది.
అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇందులో స్మృతి మంధాన (79), రిచా ఘోష్ అజేయంగా (49), షఫాలీ వర్మ (48) పరుగులు చేశారు. మంధాన, షఫాలీ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధాన 45 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు కూడా పూర్తి చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున సుగంధికా కుమారి, కవిషా దిల్హరి, చాముది ప్రభోద ఒక్కో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

