జరిమానాల మోత!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వ్యాపారులు, దుకాణదారులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు బల్దియా కీలక సూచన జారీ చేసింది.
- 30లోపు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి
- గడువు దాటితే 25 నుంచి 50 శాతం వరకు ఫైన్
- లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే 100 శాతం ..
- ప్రతి నెలా 10 శాతం అదనం
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వ్యాపారులు, దుకాణదారులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు బల్దియా కీలక సూచన జారీ చేసింది. 2027 క్యాలెండర్ సంవత్సరానికి (జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2027 వరకు) సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ లను ఈ నెల 30వ తేదీలోపు పునరుద్ధరించుకోవాలని (రెన్యువల్) స్పష్టం చేసింది. గడువులోపు రెన్యువల్ చేసుకోకపోతే భారీగా జరిమానాలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. 2026 సంవత్సరపు ట్రేడ్ లైసెన్స్‌ల గడువు డిసెంబర్ 31తో ముగియనుంది.
నిబంధనల ప్రకారం గడువు ముగియడానికి 30 రోజుల ముందే, అంటే నవంబర్ 30లోగా వ్యాపారులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026 (క్యూర్ బిల్లు)లోని సెక్షన్ 60(1) ప్రకారం.. జీహెచ్ఎంసీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఎలాంటి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారు కూడా కార్యకలాపాలకు ముందే లైసెన్స్ తీసుకోవాలని పేరొన్నారు.
జరిమానాలు ఇలా..
గడువు దాటిన తర్వాత పునరుద్ధరణ చేసుకునే వారిపై విధించే జరిమానాల వివరాలను బల్దియా వెల్లడించింది: ఈ నెల 30వ తేదీలోపు ఎలాంటి జరిమానా లేకుండా సాధారణ ఫీజుతో రెన్యువల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31, 2027 వరకు బై-లా 4(i) ప్రకారం, గడువు దాటిన 60 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే 25 శాతం జరిమానా చెల్లించాలి. ఫిబ్రవరి 1, 2027 నుంచి బై-లా 4(ii) ప్రకారం 60 రోజులు దాటిన తర్వాత రెన్యువల్ చేసుకుంటే 50 శాతం జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుంటే 100% ఫైన్. స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం.. అసలు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తూ తనిఖీల్లో పట్టుబడితే అప్పటికప్పుడు 100 శాతం జరిమానా విధిస్తారు.
అంతేకాకుండా, సదరు వ్యాపారి లైసెన్స్ పొందేంత వరకు ప్రతి నెలా అదనంగా 10 శాతం చొప్పున జరిమానా వసూలు చేస్తారు. వ్యాపారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జీహెచ్ఎంసీ అధికారిక వెబ్ సైట్ (https:// ghmc.gov.in), మై క్యూర్ యాప్, మీ-సేవా కేంద్రాలు లేదా జీహెచ్ ఎంసీ పౌర సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్లో సులభంగా తమ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవచ్చు. నవంబర్ 30లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసి బల్దియాకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

