Fishermens Missing | ఏడుగురు మత్స్యకారులు గల బోటు గల్లంతు.. కుటుంబ సభ్యుల ఆందోళన
Fishermens Missing | విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల జాడ తెలియకముందే ఏపీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమరావతి : విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల ( Fishermens Missing ) జాడ తెలియకముందే ఏపీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ( Konaseema ) జిల్లాలో అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. వీరు ప్రయాణించిన గంట తరువాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు.
వేట ముగించుకుని పది రోజుల్లో రావాల్సిన వారు, ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన ఏసుదాస్, కోపనాతి రామకృష్ణ, కాటాడి సతీష్, పాలెపు శాంతారావు, కర్రిరాముడు, సంఘాని తాతారావు, కొల్లాటి శ్రీనివాస్ అనే మత్స్యకారుల కోసం అధికారులు గాలింపును ప్రారంభించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

