– ప్రభుత్వ శాఖల కార్యక్రమాలపై సమీక్ష
కారేపల్లి, సెప్టెంబర్ 25 : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగరేణి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సింగరేణి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన ప్రగతి, పెండింగ్ అంశాలు,అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను సమీక్షలో సమర్పించాలని ఆదేశించారు.