Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Forced To Drink Petrol, Set On Fire | వైరల్ రీల్ కోసం కొందరు యువకులు ప్రయత్నించారు. ఒక వ్యక్తితో బలవంతంగా పెట్రోల్ తాగించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు కాలుతున్న దుస్తులు విప్పి అక్కడి నుంచి పరుగెత్తాడు.
కోల్‌కతా: వైరల్ రీల్ కోసం కొందరు యువకులు ప్రయత్నించారు. ఒక వ్యక్తితో బలవంతంగా పెట్రోల్ తాగించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు కాలుతున్న దుస్తులు విప్పి అక్కడి నుంచి పరుగెత్తాడు. (Man Forced To Drink Petrol, Set On Fire) ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇది జరిగింది. అక్టోబర్ 27న పని తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు నిలువరించారు. గర్ఫాలోని హల్టు ప్రాంతంలో ఉన్న చెరువు సమీపానికి అతడ్ని తీసుకెళ్లారు.
కాగా, ఆట నెపంతో ఆ యువకుడి కళ్లకు గంతలు కట్టారు. అతడి తలపై హెల్మెట్ ఉంచారు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఆ వ్యక్తి తన హెల్మెట్‌ను తీయగానే బలవంతంగా బాటిల్లో ఉన్న పెట్రోల్ తాగించడానికి వారు ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
మరోవైపు ఆ వ్యక్తి చొక్కాకు మంటలంటుకున్నాయి. భయాందోళన చెందిన అతడు కాలుతున్న దుస్తులు విప్పి అక్కడి నుంచి పరుగెత్తాడు. కాలిన గాయాలైన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ సంఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ప్రధాన నిందితుడైన అర్ఘ్య సాహాతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ‘రీల్’ చేయాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ సంఘటనకు పాల్పడి దీనిని రికార్డ్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Kolkata : Garfa
A young man was allegedly set on fire after being doused with petrol in an incident reportedly staged to create a social media reel. Police have arrested three people, including the alleged main accused, #Arghya_Saha , while two minors have been taken into custody. Police have initiated an investigation, treating the incident as a case of attempted murder.— Advocate Ms Alvi (@Umm_e_Meeran) November 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

