మళ్లీ మెరిసిన బంగారం
బంగారం ధరలు మళ్లీ మండుతున్నాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించిన అతి విలువైన లోహాలు మళ్లీ పుంజుకున్నాయి.
- రూ.3 వేలకు పైగా పెరిగిన ధర
న్యూఢిల్లీ, నవంబర్ 27: బంగారం ధరలు మళ్లీ మండుతున్నాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించిన అతి విలువైన లోహాలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతోపాటు దేశీయంగా పెండ్లిండ్ల సీజన్ కూడా తోడవడంతో ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.3,100 పెరిగి రూ.1.30 లక్షలు దాటింది.
బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి గోల్డ్ రూ.1,30,600గా నమోదైంది. గురువారం ఈ ధర రూ.1,27,500గా ఉన్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ముడిచమురు ధరలు పెరగడం, భారతీయ వస్తువులపై అమెరికా ప్రతిపాదించిన సుంకాల వల్ల రూపాయి మళ్లీ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయ బులియన్ ధరలపై ఒత్తిడి కొనసాగినా, దేశీయ ధరలకు ఇది కొంత మద్దతు ఇవ్వవచ్చని చెప్పారు. ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం ధరలు తక్కువగా ఉండటం పెళ్లిళ్ల సీజన్లో, తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయని చెప్పారు. అయితే ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుదలు ఉండటంతో జ్యువెలర్లు నిల్వలను పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
వెండి వెలుగులు
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఒక్కసారిగా ఎగువ ముఖం పట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.13,500 ఎగబాకింది. నిన్నటితో పోలిస్తే తొమ్మిది శాతం ఎగబాకి రూ.1,63,500 పలికింది. అంతకుముందు ఇది రూ.1.50 లక్షలుగా ఉన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానంపై అంచనాలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండటం వల్ల పసిడి, వెండి ధరల పెరుగుదలకు పరిమితి పడవచ్చని విశ్లేషకులు వెల్లడించారు.
దీర్ఘకాలంలో కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, ప్రభుత్వ రుణభారం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారానికి మద్దతుగా ఉంటాయని అన్నారు. వెండి ధరల్లో మాత్రం మరింత హెచ్చుతగ్గులు ఉండవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 105.22 డాలర్లు లేదా 3 శాతం పెరిగి 3,672.06 డాలర్లకు చేరుకోగా, వెండి వరుసగా మూడో సెషన్లోనూ 7 శాతానికిపైగా పెరిగి ఔన్సుకు 43.97 డాలర్లకు చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

