ఆశావాహుల ఆశలు ఆవిరి
ప్రత్యేక అధికారుల పాలన రావడంతో ఇక్కడే ఆశావహుల ఆశలపై రేవంత్ రెడ్డి సరార్ తొలి చల్లటి నీళ్లు చల్లింది. కార్పొరేటర్లుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆశలను ఆవిరి చేస్తూ ప్రభుత్వం కాలయాపన విధానాన్ని ఎంచుకుంది. సాకులు వెతుకోవడం, బాధ్యతల నుంచి పారిపోవడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పాలకులు కార్పొరేషన్ ఎన్నికలకు అటకెకించే కుట్రకు తెరలేపి విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్నది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్), ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, ఖైరతాబాద్ ఉప ఎన్నికల, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, తాజాగా జనవరి 10 నుంచి మార్చి వరకు జరిగే స్వీయ గణన ..ఇలా ఒకదాని తర్వాత ఒకటి సాకులను తెరపైకి తెస్తూ ప్రభుత్వం కాలం గడిపేస్తోంది.
అసలు నిజమేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన మూడేండ్ల పాలనలో హైదరాబాద్ మహానగరంలో ఎదురవుతున్న తీవ్ర పాలనా వైఫల్యాలు, రోడ్ల దుస్థితి, మౌలిక వసతుల లేమి, పెరిగిన ప్రజాకర్షణ లోపం బయటపడతాయనే భయంతోనే రేవంత్ రెడ్డి సరార్ ఎన్నికలకు వెళ్లకుండా పారిపోతోందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా బీసీ గణన, వార్డుల పునర్విభజన సాకులను అడ్డుపెట్టుకుని ట్రై కార్పొరేషన్ల పోరుకు ఇప్పట్లో కష్టమేనన్న సంకేతాలు ఇవ్వకనే ఇస్తున్నది. ఇందుకు ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు కనీసం సమీక్ష జరపకపోవడం బలం చేకూర్చుతున్నది.
‘కర్ణాటక’ బాటలో రేవంత్ సర్కార్
సరిగ్గా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ అకడి కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ)లో గడిచిన కొన్నేండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులతోనే నెట్టుకొస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే కర్ణాటక ఫార్ములాను హైదరాబాద్‌లో అమలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల జోలికి వెళ్లకుండా, అధికారుల ద్వారానే పాలన సాగిస్తూ విపక్షాలకు రాజకీయంగా అవకాశం ఇవ్వకూడదనే ఎత్తుగడ ఇందులో దాగి ఉందని తెలుస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

