ఆఖరాటకు అమ్మాయిలు
- సెమీస్‌లో 6-1తో మలేసియాపై విజయం
భోపాల్: సొంతగడ్డపై మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశ జోరును నాకౌట్లోనూ కొనసాగించిన ఆతిథ్య జట్టు శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 6-2తో మలేసియాను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెల్లింది. భారత్ కొట్టిన ఆరు గోల్స్‌లో ఐదు పెనాల్టీ కార్నర్ల ద్వారానే వచ్చాయి. దీపిక రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆట ఆరంభం నుంచే భారత్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. పదో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌కు ముంతాజ్ ఖాన్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచింది. 18వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో నవ్‌నీత్ కౌర్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది.
25వ నిమిషంలో దీపిక స్కోరును 3-0కు చేర్చింది. రెండు నిమిషాల తర్వాత నూర్ అజ్హర్ మలేసియాకు తొలి గోల్ అందించింది. కానీ, 30వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మార్చడంతో భారత్ 4-1 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది. సెకండాఫ్‌లో సునీలిత టొప్పో (33వ నిమిషం), ఇషికా (57వ ని) మరో రెండు గోల్స్ తో జట్టుకు భారీ విజయాన్ని అందించారు. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో చైనా 1-0తో జపాన్ను ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

