Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Congress MLA finds couple in his room | ఎమ్మెల్యేల విశ్రాంతి భవనంలో తనకు కేటాయించిన రూమ్‌లో ఒక యువ జంట అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గమనించారు. ఇది చూసి ఆయన షాక్ అయ్యారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భోపాల్: ఎమ్మెల్యేల విశ్రాంతి భవనంలో తనకు కేటాయించిన రూమ్‌లో ఒక యువ జంట అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గమనించారు. ఇది చూసి ఆయన షాక్ అయ్యారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (Congress MLA finds couple in his room) మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 2న మహిద్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్ బాస్, ఢిల్లీ నుంచి భోపాల్‌కు తిరిగి వచ్చారు. ఆ మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోపాల్‌లోని ఎమ్మెల్యేల రెస్ట్ హౌస్‌కు ఆయన చేరుకున్నారు.
కాగా, ఎమ్మెల్యేల విశ్రాంతి భవనం బ్లాక్ 3లోని 14, 15 నంబర్ గదులను కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో 15వ నంబర్ రూమ్ తాళం కోసం కేర్‌టేకర్‌ను ఆయన అడిగారు. అయితే ఆ రూమ్ అందుబాటులో లేదని అక్కడి సిబ్బంది చెప్పారు. 14వ గది తాళాన్ని ఆ ఎమ్మెల్యేకు అందజేశారు. దీంతో దినేష్ జైన్ ఆ గదికి చేరుకున్నారు. అయితే తనకు అధికారికంగా కేటాయించిన 15వ గదిలో ఒక యువకుడు, ఒక యువతి అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని ఆ ఎమ్మెల్యే గమనించి షాక్ అయ్యారు. ఆయనను చూడగానే ఆ జంట అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ సంఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్ ఆగ్రహించారు. తనకు అధికారికంగా కేటాయించిన గదిలోకి, తాను లేని సమయంలో మరొకరు ఎలా ప్రవేశించారని రెస్ట్ హౌస్ సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. తనకు కేటాయించిన గదుల తాళాలను రిసెప్షన్ కౌంటర్లో ఉంచినట్లు తెలిపారు. అయితే తన అనుమతి లేదా ప్రమేయం లేకుండానే ఆ తాళాలను కేర్‌టేకర్ ఆ జంటకు అప్పగించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు.
అలాగే ఎమ్మెల్యేల రెస్ట్ హౌస్‌లో భద్రతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ సచివాలయం ఆయన ఫిర్యాదును ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)కు పంపింది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేకు కేటాయించిన గదిలోకి ఆ జంట ఎలా ప్రవేశించింది, ఆ ప్రాంగణంలో గది తాళాల నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పీడబ్ల్యూడీ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

