Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచిలేని వంటకాలే తినాలని, ఇష్టమైన పదార్థాలకు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ సంప్రదాయ వంటకాలకు చిన్న మార్పులు చేస్తే రుచితోపాటు పోషకాలు కూడా పొందవచ్చు. ఇందుకు మంచి ఉదాహరణ అధిక ప్రొటీన్లు ఉండే మినీ ఇడ్లీలు. ఈ అల్పాహారంలో 23 గ్రాముల ప్రొటీన్ ఉండడంతోపాటు 300 కేలరీల కంటే తక్కువ శక్తి లభిస్తుంది.
Protein Idly | ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచిలేని వంటకాలే తినాలని, ఇష్టమైన పదార్థాలకు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ సంప్రదాయ వంటకాలకు చిన్న మార్పులు చేస్తే రుచితోపాటు పోషకాలు కూడా పొందవచ్చు. ఇందుకు మంచి ఉదాహరణ అధిక ప్రొటీన్లు ఉండే మినీ ఇడ్లీలు. ఈ అల్పాహారంలో 23 గ్రాముల ప్రొటీన్ ఉండడంతోపాటు 300 కేలరీల కంటే తక్కువ శక్తి లభిస్తుంది.
కావల్సిన పదార్థాలు..
ఈ ఇడ్లీల తయారీకి 100 గ్రాముల మొలకెత్తిన పెసలు, 100 గ్రాముల తక్కువ కొవ్వు ఉండే పనీర్, 30 గ్రాముల ఓట్స్, 50 గ్రాముల తక్కువ కొవ్వు పెరుగు, ఒక టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ ఈనో, అవసరమైనంత నీరు తీసుకోవాలి. పోపు కోసం అర టీ స్పూన్ ఆలివ్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, ఒకటి లేదా రెండు ఎండు మిరపకాయలు, ఆరు నుంచి ఎనిమిది కరివేపాకులు, కావాలనుకుంటే పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు సిద్ధం చేసుకోవాలి.
ఎలా తయారు చేయాలి..?
ముందుగా మొలకెత్తిన పెసలు, పనీర్ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీరు మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఆ తర్వాత ఓట్స్, పెరుగు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ పిండిని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇడ్లీలను ఆవిరిపై ఉడికించే ముందు ఈనో వేసి మెల్లగా కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి పిండిని చిన్న చిన్న గుంతల్లో పోసి 10 నుంచి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
మరోవైపు బాణలిలో ఆలివ్ నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉడికిన ఇడ్లీలను ప్లేట్ల నుంచి తీసి ఈ పోపులో వేసి సుమారు రెండు నిమిషాల పాటు కలపాలి. చివరగా కొద్దిగా పొడి మసాలా చల్లుకోవాలి. కొబ్బరి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, నీరు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బితే కొబ్బరి చట్నీ సిద్ధమవుతుంది. వేడివేడి మినీ ఇడ్లీలను ఈ చట్నీతో కలిపి వడ్డించుకోవచ్చు. సాధారణ ఇడ్లీలకు భిన్నంగా మొలకెత్తిన పెసలు, పనీర్, ఓట్స్ కలిపి తయారుచేసే ఈ అల్పాహారం ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కోరుకునేవారికి మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

