Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Doctor Attacked By Cop | చేతికి గాయమైన కొడుకును ఒక పోలీస్ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్ ఆ గాయం తీవ్రమైనది కాదని అన్నారు. ఆగ్రహించిన ఆ పోలీస్, ఆయన కుమారుడు కలిసి ఆ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: చేతికి గాయమైన కొడుకును ఒక పోలీస్ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్ ఆ గాయం తీవ్రమైనది కాదని అన్నారు. ఆగ్రహించిన ఆ పోలీస్, ఆయన కుమారుడు కలిసి ఆ డాక్టర్‌పై దాడి చేశారు. (Doctor Attacked By Cop) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 4న నాగ్‌పూర్ నగర పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు బైక్ చైన్ క్లీనింగ్ చేస్తుండగా చేతికి స్వల్ప గాయమైంది. దీంతో చికిత్స కోసం కుమారుడిని నాగ్‌పూర్‌లోని ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ఆ పోలీస్ అధికారి తీసుకెళ్లారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత తన కుమారుడికి తక్షణం చికిత్స అందించాలని ఆ పోలీస్ అధికారి డిమాండ్ చేశారు. ఒక రెసిడెంట్ డాక్టర్ ఆ వ్యక్తి గాయాన్ని పరిశీలించారు. అది స్వల్ప గాయమని, ఇంటికి తీసుకువెళ్లి డ్రెస్సింగ్ చేయమని సలహా ఇచ్చారు. మరింత తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి ఆ డాక్టర్ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ పోలీస్ అధికారికి కోపం వచ్చింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది.
మరోవైపు ఆ పోలీస్, ఆయన కుమారుడు కలిసి ఉన్నట్టుండి ఆ డాక్టర్‌పై దాడి చేశారు. రోగి ఉన్న బెడ్‌పైకి ఆయనను తోసివేశారు. ఆ తర్వాత కూడా వారి మధ్య వాగ్వాదం కొనసాగింది, చివరకు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఆ పోలీస్, ఆయన కుమారుడ్ని డాక్టర్ రూమ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు.
కాగా, తనపై జరిగిన దాడి గురించి ఆ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ డాక్టర్ తమపై దాడి చేసినట్లు పోలీస్ అధికారి, ఆయన కుమారుడు కూడా ప్రతిగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇరుపక్షాల ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే తమ సహోద్యోగిపై జరిగిన దాడిని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఖండించింది. దాడికి గురైన డాక్టర్‌పైనే కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. డాక్టర్‌పై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని, నిందితులను అరెస్ట్ చేయాలని, ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. హాస్పిటల్‌లోని సీసీటీవీలో రికార్డైన డాక్టర్‌పై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Nagpur:A resident doctor was allegedly assaulted by a police official and his son in Mayo Hospital on Nov 4. According to Maharashtra Association of Resident Doctors (MARD), the incident occurred after the doctor prioritised the treatment of a critically ill patient. #ViralVideo https://t.co/1DZmTdKbdL
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

