ఆర్టీసీ బస్సుల్లో ఐ-అలర్ట్ పరికరం
ఆర్టీసీలో ఇంధనం పొదుపుతోపాటు ప్రమాదాల నివారణకు సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఐ-అలెర్ట్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
- ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ.. 1500 బీఎస్-6 బస్సుల్లో ఏర్పాటు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఇంధనం పొదుపుతోపాటు ప్రమాదాల నివారణకు సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఐ-అలెర్ట్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఐ-అలర్ట్ ద్వారా నిర్దేశించిన గ్రీన్ బాండ్ ఆర్పీఎం పరిధిలో డ్రైవింగ్ చేయడం, ఎకానమీ గేర్లను సమర్థంగా వాడటం, ఇంజిన్ అనవసర వినియోగాన్ని తగ్గించినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అతివేగానికి(ఓవర్ స్పీడ్) కళ్లెం వేయడం, నిర్లక్ష్యంగా బ్రేక్‌ల వాడకం, ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అలవర్చుకోవడం వంటి అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తున్నదని అంటున్నారు.
ఈ ఐ-అలర్ట్ ఒక్కో డ్రైవర్ పనితీరును పరిశీలిస్తూ, క్రమం తప్పకుండా సమాచారం ఇస్తుంది. విధి నిర్వహణ అనంతరం డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనావేసి పనితీరుకు గ్రేడింగ్స్ కూడా ఇస్తున్నదని, దీంతో డ్రైవర్లకు తాము హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఆర్టీసీలో 1,500 అశోక్ లేలాండ్ బస్సుల్లో ఐ-అలెర్ట్ పరికరాలను అమర్చడం ద్వారా రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల ఆయిల్ ఆదా అవుతున్నది. ఈ సమర్థ టెక్నాలజీ వినియోగం ద్వారా సంస్థ ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హెచ్ఎస్డీ (హై-స్పీడ్ డీజిల్) ఆయిల్‌ను ఆదా చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

