ఢిల్లీ గిల్లీ జాన్తానై నేనే ఫైనల్!
తెలంగాణ కాంగ్రెస్‌పై తనదే ఆధిపత్యం అని, ఢిల్లీ పరిచయాలతో ఇక్కడ పప్పు లు ఉడకవని, వచ్చే శాసనసభ టికెట్ల కేటాయింపులు తన లెక్కలోనే ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా తేల్చిచెప్పారు.
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల టికెట్లు.. నా లెకలోనే!
- ఢిల్లీతో మీ పరిచయాలు ఇక్కడ పని చేయవు
- ముందొకటి.. వెనుకొకటి చెప్తే లెక తేలుస్తం
- కష్టపడుతున్నది, దెబ్బతీస్తున్నది ఎవరో తెలుసు
- ఐదేండ్ల బ్యాలెన్స్ షీట్ తర్వాతే వారికి గుర్తింపు
- పార్టీ నాయకులకు సీఎం రేవంత్ సంకేతాలు
- తన నిర్ణయమే కీలకమని పరోక్షంగా స్పష్టీకరణ
హైదరాబాద్ , నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్‌పై తనదే ఆధిపత్యం అని, ఢిల్లీ పరిచయాలతో ఇక్కడ పప్పు లు ఉడకవని, వచ్చే శాసనసభ టికెట్ల కేటాయింపులు తన లెక్కలోనే ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రతి నాయకుడి మాటతీరు, ప్రవర్తన, పార్టీ కోసం చేస్తున్న పని, పార్టీకి నష్టం కలిగిస్తున్న వ్యవహారాలన్నీ రికార్డు అవుతున్నాయని, ఐదేండ్లకు ఒకసారి పార్టీ బ్యాలెన్స్ షీట్ కొలుస్తామని స్పష్టంచేశారు. ఈ ప్రకటనతో పార్టీలో తన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నవారికి, అధిష్ఠానం వద్ద తమకున్న పరిచయాలను బలంగా ప్రచారం చేసుకుంటున్న వారికి రేవంత్‌రెడ్డి ఒకేసారి హెచ్చరికలు జారీ చేసినట్టు అయింది. కూడికలు, తీసివేతల తర్వాత ఎవరి శ్రమ ఎంతో తేలుతుందని చెప్పడం ద్వారా టికెట్ల పంపిణీలో తనదైన ప్రమాణాలు ఉంటాయనే సంకేతాలిచ్చినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో పరిచయాలు ఉన్నంత మాత్రాన సీట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమేనని తేల్చిచెప్పారు. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో? పనిచేస్తున్నట్టు కనిపిస్తూ వెనుక నుంచి ఎవరు పార్టీని దెబ్బతీస్తున్నారో? పార్టీ వద్ద సమగ్ర సమాచారం ఉన్నదని పేరొన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తనకు పోటీగా ఎదగాలని చూస్తున్న నాయకులను, అధిష్ఠానం వద్ద తమకంటూ ప్రత్యేక పలుకుబడి ఉందని భావిస్తున్న వారిని ఉద్దేశించినవేనన్న చర్చ జరుగుతున్నది.
ఎవరేం చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నాం..
పార్టీ నాయకుల ప్రవర్తనను కూడా రికార్డు చేస్తున్నామని రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మంచిని మైకులో, చెడును చెవిలో చెప్పాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేతలకు స్పష్టమైన హెచ్చరిక కనిపిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారికి ఇకపై అలాంటి స్వేచ్ఛ ఉండదనే సంకేతాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అసంతృప్తి ఉంటే పార్టీ వేదికలపై చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే మాత్రం ఆ వ్యవహారం కూడా లెకలోకి వస్తుందనే ప్రత్యక్ష ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. తనకు లాయల్టీగా ఉన్న వారికి ఒకలా, లేని వారికి మరోలెక ఉంటుందని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతున్నది.
నా వల్లే పార్టీకి పునరుజ్జీవం
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి కాంగ్రెస్‌కు 3శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని సీఎం చెప్పారు. అందుకు ఉదాహరణగా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో వెంకట్‌కు టికెట్ ఇస్తే 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. అప్పటినుంచి తన కృషితో పార్టీకి 40శాతం ఓట్లు తీసుకొచ్చానని రేవంత్ చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతం కోసం తాను పడిన కష్టాన్ని గుర్తించాలని, కానీ ఆ శ్రమను పకనపెట్టి కేవలం ఢిల్లీ పెద్దలతో పరిచయాల ఆధారంగా ప్రాధాన్యం కోరుకోవడం కుదరదనే భావనను వ్యక్తంచేశారు. ఇక హరర వేణుగోపాల్, జనక్ ప్రసాద్ పేర్లను ఉదహరిస్తూ తనను నమ్ముకున్న వారికి అవకాశాలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి తన నాయకత్వంపై విశ్వాసంతో పనిచేసేవారికి ప్రాధాన్యం ఉంటుందని, ధికరించే వారికి మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్రం సాయం కోసం వరుస విజ్ఞప్తులు
రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదురొనేందుకు రూ.30 వేల కోట్ల సాయం అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. అయితే, సెప్టెంబర్‌లో అసెంబ్లీ సైతం కేంద్రాన్ని రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరుతూ తీర్మానం చేసింది. తాజాగా పీఏసీ వేదికగా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సీఎం సూచించడం గమనార్హం. ఇప్పటికే సాయం కోసం ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 20 కోట్ల ఓట్ల తొలగింపునకు అవకాశం ఉన్నదని పేరొన్నారు. తెలంగాణలో 71 లక్షల ఓట్లను పకన పెట్టారని ఆరోపించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం తరహాలో ‘జ్ఞానేశ్‌కుమార్ గోబ్యాక్’ నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాబలం కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే 2027లో కేంద్రం చేపట్టే జనగణనలో ఓబీసీ కులగణన కూడా చేపట్టాలని, ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

