ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్!
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల కరువు ప్రభావం ఆర్టీసీ ప్రయాణికులపై పడుతున్నది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తాగునీటిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండగా..
- నీళ్లు లేకనే బస్సుల్లో జీవా బాటిల్స్ బంద్
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల కరువు ప్రభావం ఆర్టీసీ ప్రయాణికులపై పడుతున్నది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తాగునీటిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండగా.. ఆ ప్రభావం ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి కేంద్రంగా నీళ్లు సరఫరా చేస్తున్న సంస్థలపైనా పడింది. ఈ నీటి కరువు ప్రభావాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులు అనుభవిస్తున్నారు.
ఎందుకంటే ఆర్టీసీకి వాటర్‌ను సప్లయ్ చేస్తున్న ఫౌంటెన్ స్ప్రింగ్స్ సంస్థ రంగారెడ్డి జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నది. దీనికి నీటి సరఫరా నిలిచిపోయిందని ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. కరువు నేపథ్యంలో ఆర్టీసీకి సరఫరా అయ్యే నీటి విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ఇప్పుడు ప్రయాణికులకు సప్లయ్ చేస్తున్న తాగునీరు (జీవా)పూర్తిగా నిలిచిపోయింది. ఈ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు వాటర్ ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్తున్న ఉన్నతాధికారులు.. ఆ సమస్యను దాదాపు 20 రోజులు గడిచినా పరిష్కరించలేకపోయారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే టికెట్ ధరలో నీటి చార్జీ చెల్లించిన ప్రయాణికులు.. బయట మళ్లీ డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా ప్రయాణికుల నుంచి ఒక్కో టికెట్‌కు రూ.10 వసూలు చేస్తున్న ఆర్టీసీ ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలా చేయని పక్షంలో ప్రయాణికులకు ఇచ్చే టికెట్లో నీటికి ఇచ్చే రూ.10 తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

