హైదరాబాద్‌కు ఉగ్రదాడుల హెచ్చరిక..!
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుని 26/11 ముంబై ఉగ్రదాడుల..
- కాచిగూడ స్టేషన్, ‘ప్లాజా’ టార్గెట్
- 300 మందిని చంపుతామని మెయిల్
- అప్రమత్తమైన పోలీస్, నిఘా వర్గాలు
- నగరవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుని 26/11 ముంబై ఉగ్రదాడుల తరహాలో దాడులు చేస్తామని, 300మందిని చంపుతామని హెచ్చరిస్తూ శనివారం హైదరాబాద్ పోలీసు స్పెషల్ బ్రాంచ్‌కు మెయిల్ వచ్చింది. ఈనెల 18న కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా జంగల్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో హతమైన లష్కరేతోయిబా ఉగ్రవాది లతీఫ్భట్, అతని అనుచరుల ఘటనకు ప్రతీకారంగానే నగరంలో దాడులు చేస్తామని బెదిరించినట్ట్లు మెయిల్లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.
బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, నగర పోలీసు స్పెషల్‌బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఉన్నతాధికారులకు అప్రమత్తత సూచనలుచేశారు. ముఖ్యంగా బెదిరింపు వచ్చిన కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా దగ్గర భద్రతను పెంచాలని సూచించారు. రైల్వేస్టేషన్లు, హోటళ్లు, ప్రార్ధనామందిరాలు, రద్దీప్రాంతాల్లో నిఘా ముమ్మురంచేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, గుర్తుతెలియని వస్తువులు, నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలు, అసాధారణ కదలికలపై ప్రత్యేకదృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచడంతో పాటు యాంటీ సబోటేజ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కమిషనర్ స్పష్టంచేశారు. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ నిజంగా ఉగ్రవాద సంస్థ నుంచే వచ్చిందా? లేదా ఎవరైనా కావాలనే ఆ పేరుతో పంపించారా? మెయిల్ ఎక్కడినుంచి పంపించారనే కోణంలో మెయిల్ వెనకఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తిచేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

