వచ్చాడు వందో గ్రాండ్‌మాస్టర్
భారత చదరంగం అరుదైన, అత్యద్భుతమైన మైలురాయిని చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ అనుజ్ శ్రీవాత్రి భారత్ తరఫున 100వ గ్రాండ్‌మాస్టర్ గా అవతరించి చరిత్ర సృష్టించాడు. ఏషియన్ ప్లస్ ఇండివిడ్యువల్ ఓపెన్ చెస్ చాపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం ద్వారా అనుజ్ ఈ ఘనత సాధించాడు.
- భారత 100వ జీఎంగా అనుజ్
సినాకబాన్ (ఫిలిప్పీన్స్): భారత చదరంగం అరుదైన, అత్యద్భుతమైన మైలురాయిని చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ అనుజ్ శ్రీవాత్రి భారత్ తరఫున 100వ గ్రాండ్‌మాస్టర్ గా అవతరించి చరిత్ర సృష్టించాడు. ఏషియన్ ప్లస్ ఇండివిడ్యువల్ ఓపెన్ చెస్ చాపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం ద్వారా అనుజ్ ఈ ఘనత సాధించాడు. 8 రౌండ్లకు గాను 7 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎమ్ నార్మ్‌ను పూర్తి చేసి, మైలురాయి లాంటి భారత 100వ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 1988లో దేశ తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలవడంతో ప్రారంభమైన భారత చదరంగ ప్రయాణం వందో జీఎమ్ స్థాయికి చేరుకోవడానికి 38 ఏండ్లు పట్టింది. అయితే గత ఐదు నెలల వ్యవధిలోనే భారత్ నుంచి ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

