నత్తనడకన హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్
రాష్ట్రంలో 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) ముప్పు నుంచి రక్షణ కల్పించే హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది.
- సర్వైకల్ క్యాన్సర్ నివారణలో వెనుకబడ్డ రాష్ట్రం
- రాష్ట్రంలో 14-15 ఏండ్ల బాలికలు 3,41,820
- లక్షా 11 వేల మందికి ఇంకా అందని టీకాలు
- డిసెంబర్ 31 వరకు గడువు విధించిన కేంద్రం
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) ముప్పు నుంచి రక్షణ కల్పించే హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. దేశంలో ప్రతి ఏడాదీ సర్వికల్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28న ప్రారంభించగా.. తొలుత మూడు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు.
కానీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. రాష్ట్రంలో 14-15 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు 3,41,820 మంది ఉన్నట్టు అధికారిక సర్వేలో తేలింది. వీరిలో అక్టోబర్ 30 నాటికి 2,30,155 మందికి టీకాలు ఇచ్చారు. మరో 1,11,665 మందికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తికాలేదు.
ఆయా జిల్లాల్లో ప్రక్రియ ఇలా..
రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా 49 శాతం వ్యాక్సినేషన్‌తో చివరి స్థానంలో నిలిచింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు 54 శాతం, నిజామాబాద్, నారాయణపేట, మల్కాజిగిరి జిల్లాల్లో 55 శాతం చొప్పు వ్యాక్సినేషన్ నమోదైంది. నిర్మల్‌లో 56శాతం, మహబూబ్‌నగర్ 57 శాతం, కామారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడం 58 శాతంగా వ్యాక్సినేషన్ నమోదైంది. మొత్తం 15 జిల్లాల్లో 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. హైదరాబాద్‌లో 42,360 మందికి గానూ 29,808 మందికి టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11 నాటికి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరంలో 100 శాతం, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాంలో 90 శాతం, కర్ణాటకలో 85 శాతం ప్రక్రియ పూర్తయింది.
తెలంగాణలో మాత్రం 60 శాతం పూర్తయినట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వైద్యాధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 55వేల నుంచి 66 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదు అవుతుండగా.. వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య 10 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటా 3,200 సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అత్యంత కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రభుత్వం ఇప్పటికైనా నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

