Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Silent Diwali | దీపావళి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా బాణసంచా సందడి మొదలవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే మన దేశంలో కొన్ని గ్రామాల్లో మాత్రం దీపావళి రోజు బాణసంచా కాల్చరు.
Silent Diwali | దీపావళి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా బాణసంచా సందడి మొదలవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే మన దేశంలో కొన్ని గ్రామాల్లో మాత్రం దీపావళి రోజు బాణసంచా కాల్చరు. కనీసం పెద్ద శబ్దాలు చేసే టపాసుల జోలికి కూడా వెళ్లరు. పండుగను దీపాలు వెలిగించి, పూజలు చేసి, స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటారు. ఇదేదో ప్రభుత్వ ఆంక్షల వల్ల అనుకుంటే పొరబడినట్లే. తమ గ్రామాల్లో నివసించే పక్షులు, గబ్బిలాలు, ఇతర జీవులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయి? వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలేంటో తెలుసుకుందాం.
గబ్బిలాల కోసం నాలుగు తరాలుగా టపాసులకు దూరం!
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న బాల్లెనహళ్లి గ్రామంలో దీపావళి వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ దాదాపు 2 వేల గబ్బిలాలు గ్రామంలోని ఆలయం సమీపంలో ఉన్న చెట్లపై నివసిస్తున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని గ్రామస్తులు బాణసంచా కాల్చడం మానేశారు. నాలుగు తరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గబ్బిలాలను కూడా తమ గ్రామ దేవుడు మునియప్పతో సమానంగా భావిస్తామని చెబుతున్నారు. పిల్లలకు టపాసులు కాల్చాలనిపిస్తే గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పొలాల వైపు వెళ్లి కాల్చుకోవాలని సూచిస్తారు. పండుగ రోజున ఇక్కడ దీపాలు వెలిగించి, పూజలు చేసి, విందు భోజనాలతో ఆనందంగా గడుపుతారు.
పక్షుల కోసం 50 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి..
తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఉన్న కొల్లుకుడిపట్టి గ్రామంలోనూ దీపావళి రోజున టపాసులు కాల్చరు. ఈ గ్రామానికి సమీపంలో వెట్టంగుడి పక్షుల అభయారణ్యం ఉంది. ప్రతి ఏడాది వేలాది వలస పక్షులు ఇక్కడికి వచ్చి గూళ్లు కట్టుకుంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య పక్షుల సంతానోత్పత్తి సమయం కావడంతో బాణసంచా శబ్దాలు వాటికి ఇబ్బంది కలిగిస్తాయని గ్రామస్తులు గుర్తించారు. గతంలో టపాసుల శబ్దానికి పక్షులు భయపడి గూళ్లను వదిలి వెళ్లడం, గుడ్లు దెబ్బతినడం వంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సుమారు ఐదు దశాబ్దాల క్రితమే టపాసులు కాల్చకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దీపాలు వెలిగించి, స్వీట్లు పంచుకుంటూ పండుగ జరుపుకుంటారు.
ఏడు గ్రామాల్లోనూ అదే సంప్రదాయం..
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో వడముగం వెల్లొడ్ పక్షుల అభయారణ్యం చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాల్లోనూ దీపావళి వేడుకలు భిన్నంగా ఉంటాయి. సెల్లప్పంపాళయం, వడముగం వెల్లొడ్, సెమ్మండంపాళయం, కరుక్కన్కట్టు వలసు, పూంగంపాడి తదితర గ్రామాల్లోని ప్రజలు సుమారు 22 ఏళ్లుగా టపాసులు కాల్చడం లేదు. అక్టోబర్ నుంచి జనవరి వరకు స్థానిక, వలస పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. బాణసంచా శబ్దాలతో అవి భయపడకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు కొత్త బట్టలు కొనిపెట్టి పండుగ జరుపుతారు. టపాసులకు బదులుగా పరిమితంగా మతాబులు, చిచ్చుబుడ్లు మాత్రమే కాల్చుకునేలా ప్రోత్సహిస్తారు.
అసోంలో హర్గిలా పక్షుల కోసం..
అసోంలోని కామ్రూప్ జిల్లాలో ఉన్న దాదరా, పచారియా, సింగిమారి గ్రామాల్లోనూ పర్యావరణహిత దీపావళికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ అంతరించిపోయే ప్రమాదం ఉన్న గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ అనే హర్గిలా పక్షులు నివసిస్తాయి. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వాటి సంతానోత్పత్తి కాలం. బాణసంచా శబ్దాలకు పక్షులు భయపడి గూళ్లను వదిలి వెళ్లే ప్రమాదం ఉండటంతో స్థానిక మహిళలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హర్గిలా ఆర్మీగా ఏర్పడిన మహిళల బృందం గ్రామాల్లో తిరుగుతూ టపాసులు కాల్చవద్దని ప్రచారం చేస్తోంది. గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆలయ నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు.
గబ్బిలాల కోసం మరో గ్రామం..
తమిళనాడులోని పెరంబూర్ గ్రామంలోనూ గబ్బిలాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ సుమారు 150 ఏళ్ల వయసున్న మర్రిచెట్టుపై వందలాది గబ్బిలాలు నివసిస్తున్నాయి. ఈ చెట్టును స్థానికంగా వావ్వాల్ తోటగా పిలుస్తారు. గబ్బిలాలకు బాణసంచా శబ్దాలు, పొగ వల్ల ఇబ్బంది కలగకూడదని గ్రామస్తులు దీపావళి రోజున టపాసులు కాల్చరు. నూనె దీపాలు వెలిగించి, ఆలయాల్లో ప్రార్థనలు చేస్తూ పండుగ జరుపుకుంటారు. ఈ సంప్రదాయం దాదాపు వందేళ్లుగా కొనసాగుతున్నట్లు స్థానిక కథనాలు వెల్లడిస్తున్నాయి.
పండుగ అంటే టపాసులే కాదు..!
సాధారణంగా దీపావళి అంటే వెలుగులు, బాణసంచా, సందడి గుర్తుకొస్తాయి. కానీ ఈ గ్రామాల ప్రజలు మాత్రం పండుగ ఆనందం కోసం ప్రకృతికి ఇబ్బంది కలిగించకూడదని భావిస్తున్నారు. పక్షులు, గబ్బిలాలు తమ గ్రామాల్లో భాగమని, వాటిని కాపాడుకోవడం తమ బాధ్యతని భావిస్తున్నారు. అందుకే టపాసులు కాల్చకపోయినా దీపాలు వెలిగిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకుంటూ దీపావళిని జరుపుకుంటున్నారు. ఈ గ్రామాల సంప్రదాయం పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ మంచి సందేశాన్ని ఇస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

