Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Viral News | సాధారణంగా జైళ్లలో ఉన్న ఖైదీలు, బందీలుగా ఆపాయంలో ఉన్నవాళ్లు సొరంగాలు తవ్వుకుని తప్పించుకున్న ఘటనల గురించి విన్నాం. కానీ ఇటీవల ఓ పెద్దపులి (Tiger) తెలివిగా ఎన్‌క్లోజర్ (Encloser) నుంచి సొరంగం తవ్వుకుని తప్పించుకుంది. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బుక్సా టైగర్ రిజర్వ్ (Buxa Tiger Reserve) లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
Viral News : సాధారణంగా జైళ్లలో ఉన్న ఖైదీలు, బందీలుగా ఆపాయంలో ఉన్నవాళ్లు సొరంగాలు తవ్వుకుని తప్పించుకున్న ఘటనల గురించి విన్నాం. కానీ ఇటీవల ఓ పెద్దపులి (Tiger) తెలివిగా ఎన్‌క్లోజర్ (Encloser) నుంచి సొరంగం తవ్వుకుని తప్పించుకుంది. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బుక్సా టైగర్ రిజర్వ్ (Buxa Tiger Reserve) లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎన్‌క్లోజర్ పునాది కింద సొరంగం తవ్వి మూడేళ్ల ఆడపులి చాకచక్యంగా తప్పించుకుంది.
అసోం నుంచి తిరిగి తీసుకొచ్చిన నాలుగు రోజులకే ఈ ఘటన జరగడంతో అటవీ అధికారులు విస్మయానికి గురయ్యారు. బెంగాల్లో పులుల సంఖ్యను పెంచే ప్రాజెక్టులో భాగంగా బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ నుంచి ‘టీ-138’ అనే ఆడపులిని తీసుకొచ్చారు. అక్టోబర్ 2న బుక్సాలోని 25వ మైలువద్ద ఉన్న 2.2 హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో దీనిని విడిచిపెట్టగా.. అక్టోబర్ 4 ననే బయటపడి సంకోష్ నది దాటి అసోంలోని రైమోనా ప్రాంతానికి వెళ్లిపోయింది.
అనేక రోజులు శ్రమించి, చివరకు నవంబర్ 3న మత్తుమందు ఇచ్చి పట్టుకుని మళ్లీ బుక్సా ఎన్‌క్లోజర్‌కు చేర్చారు. అయితే ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆ పులి ఎన్‌క్లోజర్ ఫెన్సింగ్ పునాది కింద మట్టిని సొరంగంలా తవ్వి బయటకు జారుకుంది. ప్రస్తుతం అది బాలా నదిని దాటి తూర్పు వైపుగా అసోం దిశగా వెళ్తున్నట్లు తెలిసింది. గతంలో వెళ్లిన మార్గంలోనే ప్రయాణిస్తే జయంతి, రైడక్, సంకోష్ నదులను దాటి అసోం లేదా భూటాన్ అడవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
సాధారణంగా కుక్కలు లేదా హైనాల మాదిరిగా పులులు నేలను లోతుగా తవ్వలేవని, ఎన్‌క్లోజర్ పునాది పటిష్ఠంగా నిర్మించి ఉంటే ఇలా జరిగేది కాదని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. దాంతో ఈ ఎన్‌క్లోజర్ నిర్మాణ నాణ్యత, భద్రతాలోపాలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

