Gyanesh Kumar : సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ప్రభుత్వం భద్రత పెంచింది ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ సహా వివిధ అంశాలలో ఈసీఐ సభ్యుల మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సర్ ద్వారా బీజేపీకి అనుకూలంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దేశంలోని అనేక చోట్ల ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అతడు తన పదవికి రాజీనామా చేయాలని, అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్లో అభిసంశన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కర్ణాటక కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి దీక్ష చేసేందుకు సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) సిద్ధమవుతోంది. 48 గంటల్లోగా సీఈసీ రాజీనామా చేయకపోతే ఇంకోసారి నిరసనకు దిగుతామని సీజేపీ హెచ్చరించింది. ఇలాంటి ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.