Cauvery water : కావేరి నదీజలాల (Cauvery River Water) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో సీఎం విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడు (Tamil Nadu) కు నీటి విడుదల విషయంలో కావేరి నదీ జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 24 కు వాయిదా వేసింది.
అప్పుడే నీటి విడుదలపై స్టేటస్‌ను వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 3,500 క్యూసెక్కుల నదీ జలాలను విడుదల చేయాలని సీడబ్ల్యూఎంఏ గతంలో ఆదేశించింది. దీనిపై కర్ణాటక నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కావేరి నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది.