New Pensions : రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న పింఛన్లపై స్త్రీ, శిశు సంక్షేమం శాఖ మంత్రి సీతక్క (Seethakka) దృష్టి సారించారు. అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే కొత్త పెన్షన్లు అందేలా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అందుకని పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి గురించి క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు సీతక్క.
కొత్త పింఛన్ లబ్దిదారులకు అక్టోబర్‌లో తీపి కబురు చెప్పాలని స్త్రీ, శిశు సంక్షేమం శాఖ మంత్రి సీతక్క అధికారులకు తెలిపారు. దసరా ముందే వారికి పింఛన్లు అందాలని, అందుకు త్వరితగతిన క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు.
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించిన సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు సీతక్క స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని ఆమె సూచించారు. కాబట్టి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు. దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులతో మంత్రి పేర్కొన్నారు.